BigTV English

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..

Rain Alert: వదలని వర్షాలు.. మళ్లీ భారీ వర్ష సూచన..

Rain Alert: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనితో పలు జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ప్రకటన విడుదల చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే అధికారులు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.


ఇటీవల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటికి మొన్న రాయలసీమ ప్రాంతంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురవగా, స్థానిక జలాశయాలు జలకళ ను సంతరించుకున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు సైతం నీట మునగగా, అధికారులు తీసుకున్న చర్యలతో ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఆ తర్వాత చెన్నైలో భారీ వర్షాలు కురిసాయి. ఇక ఏపీకి వర్ష సూచన ఉండదని భావిస్తున్న తరుణంలో తాజాగా వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది.

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.


Also Read: Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు క్లాస్

అంతేకాకుండా రాష్ట్రంలోని వైయస్సార్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సైతం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సైతం కోరింది. ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు వద్దకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు మెరుపుల సమయంలో ప్రజలు ఇంటిపట్టునే ఉండడం మంచిదని ప్రభుత్వం సూచించింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×