E-Paper
Advertisement

Michaung Cyclone : నెల్లూరు పై తుపాన్ ప్రభావం.. నక్కల కాల్వ ఉద్ధృతి..

Michaung Cyclone : నెల్లూరు పై తుపాన్ ప్రభావం.. నక్కల కాల్వ ఉద్ధృతి..
Advertisement

Michaung Cyclone : మిగ్‌జాం తుఫాన్ ప్రభావం తో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, వెంకటాచలం, మనుబోలు మండలాల పరిధిలో రాత్రి నుంచి ఈదురు గాలితో కూడిన వర్షం కురుస్తోంది. ఈదురుగాలు ఎక్కువగా ఉండటంతో పలు గ్రామంలో చెట్లు నేలకొరిగాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

ఈదురుగాలులతో కురుస్తున్న వర్షంతో, చలి ఎక్కువ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం కలిగింది. ముత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామ సమీపంలోని నక్కల కాల్వ ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆయా మండలాల్లోని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×