Anagani Satya Prasad: ఏపీలో భూ అక్రమాలపై లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్. మదనపల్లెలో 13 వేల ఎకరాల భూములను ఫ్రీహోల్డ్ చేసినట్టు తెలిపారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులపై శిక్ష పడడం ఖాయమన్నారు.
మండలి సమావేశాల్లో భాగంగా శుక్రవారం భూముల వ్యవహారంపై సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్ చేసినట్టు తేలిందన్నారు. ఏమైనా తప్పులు జరిగాయా అనేదానిపై విచారణ చేపట్టామన్నారు.
గత ప్రభుత్వంలో 25 వేల ఎకరాలు అమ్మకాలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్దంగా 7837 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని తేల్చారు. గడిచిన ఐదునెలలుగా 70 వేలకు పైగానే ఫిర్యాదు వచ్చాయన్నారు. అందులో ల్యాండ్ గ్రాబింగ్‌కు సంబంధించి 8305 వేలు ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసేందుకు 22 ఏ నుంచి తొలగించేందుకు గత ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు మంత్రి అనగాని. భూ కబ్జాలను అరికట్టేందుకు కూటమి సర్కార్ కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చామన్నారు.
ALSO READ: పరారీలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అరాచకాలు
ఈ చట్టం ద్వారా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టడం ఖాయమని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భూకబ్జాలకు పాల్పడినవారికి 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడేలా చట్టంలో ఉందన్నారు. దీనికి సంబందించిన బిల్లు రేపో మాపో మండలికి వస్తుందన్నారు.