BigTV English

Vishwak Sen’s Mechanic Rocky : రిలీజ్ లేదు… రీపేర్లు అవసరమా…?

Vishwak Sen’s Mechanic Rocky : రిలీజ్ లేదు… రీపేర్లు అవసరమా…?

Vishwak Sen’s Mechanic Rocky : ప్రతి వారం చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ, యంగ్ హీరో విశ్వక్ సేన్ నుంచి సినిమా వస్తుందంటే… దాదాపు 15 రోజుల నుంచి హడావుడి కనిపిస్తుంది. ప్రమోషన్స్.. ఈవెంట్స్… ఆ ఈవెంట్స్‌లో ఆ యంగ్ హీరో ఫైర్ మోడ్‌లో మాట్లాడే మాటలు. ఇలా సోషల్ మీడియాలో ఆ 15 రోజులు ఉండే రచ్చ మామూలుగా ఉండదు. అలాగే, విశ్వక్సేన్ సినిమా విడుదలకు ముందు కొద్దిపాటి వివాదం జరుగుతూ ఉంటుంది. ఏమి జరగకపోయినా విశ్వక్సేన్ కొన్నిసార్లు క్రియేట్ చేస్తాడు. దీని వల్ల కూడా సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది.


ఇప్పుడు విశ్వక్ హీరోగా వస్తున్న మెకానిక్ రాకీ మూవీకి కూడా అలాగే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, పెద్దగా సౌండ్ రావడం లేదు. బజ్ లేదు. మొన్న ఓ ఈవెంట్‌లో “బజ్ రావడం లేదు అని అంటున్నారు. నేనే బజ్ ఇవ్వలేదు అంతే. ఇప్పుడు బజ్ ఇస్తా” అంటూ విశ్వక్ తన స్టైల్‌లో ఓ డైలాగ్ వేశాడు. కానీ, హీరోగారు చెప్పిన బజ్ ఇంకా రాలేదు. మామూలుగా విశ్వక్ సినిమా విడుదలకు ముందు కొద్దిపాటి వివాదం జరుగుతూ ఉంటుంది. ఏమి జరగకపోయినా విశ్వక్సేన్ కొన్నిసార్లు క్రియేట్ చేస్తాడు.

ఆ బజ్ ఎందుకు రావడం లేదు..? సినిమాలో మ్యాటర్ ఉందా..? అసలు ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ అవుతుందా..? అనేది ఇప్పుడు చూద్ధాం…


విశ్వక్ సేన్ ఈ ఏడాది ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ నవంబర్ 22న వస్తున్నా అంటూ అనౌన్స్ చేశారు. రవితేజ ముల్లపాడి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కించాడు. మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ కథ విషయానికి వస్తే చదువు సరిగ్గా రాని ఓ యువకుడు తన తండ్రి నుంచి ఇష్టం లేకున్నా మెకానిక్ షాప్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత తన పని స్టైల్ మార్చి డ్రైవింగ్ స్కూల్ పెడతాడు. ఈ క్రమంలో ఇద్దరు అమ్మాయిలు పరిచయం అవుతారు. వారితో లవ్. ఈ క్రమంలో వచ్చే కష్టాలు సినిమాలో ఉండబోతున్నాయి.

అదే రోటీన్ స్టోరీ…

మూడు వారాల క్రితం ట్రైలర్ 1.0 అంటూ రిలీజ్ చేశారు. దీనితోనే సినిమా స్టోరీ ఏంటో తెలిసిపోగా… రోటీన్ కథ అని అర్థమైపోయింది. ఎప్పుడూ డిఫరెంట్‌గా ఆలోచించే విశ్వక్ ఇలా రోటీన్ స్టోరీని ఎలా ఎంచుకున్నాడు అని అప్పుడే టాక్ వచ్చింది.

22న రిలీజ్ లేదా..?

తాజాగా బిగ్ టీవీకి అందుతున్న సమాచారం ప్రకారం… మూవీ టీం ఫైనల్ అవుట్ పుట్ ను చూసిందట. సినిమా టీంకి ఎక్కడా కనెక్ట్ అవ్వకపోవడంతో అందరూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ అవుట్ ఫుట్‌తో ఆడియన్స్ వద్దకు వెళ్తే కష్టమని, మెకానిక్ రాకీ కి రీపర్లు చేయాల్సిందేనని ఫిక్స్ అయినట్టు సమాచారం.

రిలీజ్ వారం… ఇప్పుడు ఏం చేద్ధాం…

నవంబర్ 22న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఓ ఈవెంట్‌లో హీరో.. “నవంబర్ 22న రిలీజ్.. 21న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాను.. యూఎస్ కంటే ముందు చూడండి, సినిమా చూసినోడు బాలేదు అని చెప్తే 22న సినిమాకు రాకండి” అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ, ఇప్పుడు సినిమా చూస్తే… వాయిదా వేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారట.

మెకానిక్ రాకీ కి కావాల్సిన రిపేర్లు చేసిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×