Miniaster Anam-Botsa: తిరుపతి తొక్కిసలాట వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయా? ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందా? ఎందుకు వైసీపీ ప్లాన్‌లు బూమరాంగ్ అవుతున్నాయి? చివరకు సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సకి గట్టిగా మంత్రి ఆనం కౌంటర్ వెనుక అసలేం జరిగింది?
ఏపీలో రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే క్రమంలో పార్టీలు అభాసు పాలవుతున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ తిరుపతి తొక్కిసలాట ఘటన. అనుకోకుండా ఘటన జరిగింది.. ఆరుగురు చనిపోయారు, 40 మందికి పైగా గాయపడ్డారు. బాధితులు దర్శనం తర్వాత వైసీపీ వాయిస్ రైజ్ చేసింది.
జగన్, ఆ పార్టీ నేతల వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంత్రి ఆనం, వైసీపీ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. రాజకీయ మనుగడలో జగన్ లేరని తేల్చేశారు. దారి దోపిడీ విధానాలతో ఆ పార్టీ నడుస్తోందని, ప్రజాస్వామ్యంలో ఆయనకు స్థానమే లేదన్నారు. బాధితులను పరామర్శించాల్సింది పోయి కవర్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు.
మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాటలపై రియాక్ట్ అయ్యారు మంత్రి ఆనం. సీనియర్ నాయకుడు బొత్స.. వాళ్ల నాయకుడి గురించి కనీసం అవగాహన లేదన్నారు. ఆ పార్టీలో ఆయన అవగాహన లేని నాయకుడి కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. దేవాదాయ శాఖ గురించి బొత్స పూర్తిగా లేదన్నారు. తన శాఖలో ప్రక్షాళన జరుగుతోందని, అన్ని ఉత్సవాలకు పాలక వర్గాలతో కలిసి పని చేస్తున్నామన్నారు.
ALSO READ: పవన్ పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమలలో పాలక వర్గం ఉందని, స్వయం ప్రతిపత్తి గలిగిన సంస్థ అక్కడి వ్యవహారాలను చూస్తోందన్నారు మంత్రి. సలహాలు, సూచనలు అడిగితే తప్పకుండా ఇస్తామన్నారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వద్ద పని చేసిన అధికారి, తిరుమలలో ఎగ్జిక్యూటివ్ అధికారి ఉన్నారని, కాదని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.
దసరా, బ్రహ్మోత్సవాలు సమయంలో తిరుమల పాలకమండలి జాగ్రత్తగా పని చేసిన తీరును గుర్తు చేశారు మంత్రి ఆనం. ఇలాంటి సమయంలో పాలకవర్గం బాగా పని చేస్తుందని తాము ఆశించామని, దురదృష్టమైన ఘటనను పట్టుకుని ప్రభుత్వంపై నిందలు వేయడం, దేవాదాయ శాఖను ప్రశ్నించడం అంతకన్నా దిగజారుడు తనం మరొకటి ఉండదన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు బొత్స, ఈ స్థాయికి దిగజారుతారని తాను ఊహించలేదన్నారు. ఆయనను చూసి జాలి వేస్తుందని, బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇంతకీ బొత్స ఏమన్నారు? వైకుంట ద్వార దర్శనం ఏర్పాట్లపై సమీక్ష చేయలేనంత తీరిక దేశాదాయ శాఖ మంత్రి ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ మొదటి నుంచి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తొలగించాలని డిమాండ్ చేస్తోంది. వారిపై రక రకాలుగా బురద జల్లుతోంది. స్వయంగా జగన్.. అప్పటి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు పై మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటినా ఏపీకి తీసుకొచ్చి ఆయనను శిక్షిస్తామన్నారు. జగన్ చెప్పిన 45 రోజుల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.