BR Naidu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ఎటువంటి కామెంట్స్ చేయలేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు చేసిన కామెంట్స్ పై జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీ ప్రచురించగా చైర్మన్ స్పందించారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే తాను కామెంట్స్ చేసినట్లు చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన చైర్మన్ ను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎవరో ఏదో చెబితే వాటికి స్పందించాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని కోరారు కదా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. దీనితో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు టీటీడీ చైర్మన్ క్లారిటీ ఇవ్వడంతో జనసేన లీడర్స్ కాస్త వెనక్కు తగ్గారు.
Also Read: TTD Chairman BR Naidu: మృతుల కుటుంబాలకు అండగా టీటీడీ – చైర్మన్ బీఆర్ నాయుడు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదని, మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైర్మన్ అన్నారు. క్షమాపణల గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని టీటీడీ చైర్మన్ హితవు పలికారు