Coolie Release Date: సినిమాల టైటిల్స్ విషయంలో, రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్‌కు చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. తాము తెరకెక్కించిన హిట సినిమా విడుదలయిన తేదీలోనే మరొక సినిమా విడుదల చేస్తే అది కూడా హిట్ అవుతుందని మేకర్స్‌లో బలమైన నమ్మకం ఉంటుంది. అందుకే ఫ్లాప్ మూవీ రిలీజ్ డేట్స్‌ను పెద్దగా పట్టించుకోకపోయినా.. హిట్ మూవీస్ రిలీజ్ డేట్స్‌ను మాత్రం మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యేలా చూస్తారు. ప్రస్తుతం రజినీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కూలీ’ విషయంలో కూడా మేకర్స్ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై తాజాగా కీలక అప్డేట్ బయటికొచ్చింది.
రిలీజ్ డేట్‌పై చర్చలు
లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj), రజినీకాంత్ (Rajinikanth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. కవలం ఇందులో నటించే నటీనటులు ఎవరు అనేది మాత్రమే బయటపెట్టారు మేకర్స్. అప్పుడప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఏదో ఒక విధంగా బయటికి వచ్చింది. ప్రస్తుతం ‘కూలీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించి ఈ మూవీని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అదే సమయంలో రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది.
Also Read: ‘ గేమ్ ఛేంజర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. వసూళ్ల గేమ్ స్టార్ట్ అయ్యిందా ..?
అదే నెలలో
‘కూలీ’ (Coolie) సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రజినీకాంత్, సన్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చివరిగా వీరి కాంబోలో వచ్చిన మూవీ ‘జైలర్’. ఈ సినిమా ఏ రేంజ్‌లో సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే గతేడాది ‘జైలర్’ విడుదలయిన తేదీకే ఈ ఏడాది ‘కూలీ’ని విడుదల చేయాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2024 ఆగస్ట్‌లో వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది ‘జైలర్’. ఇప్పుడు ‘కూలీ’ని కూడా అదే నెలలో రిలీజ్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతికి బయటికొచ్చే అవకాశాలు ఉన్నాయి.
భారీ క్యాస్టింగ్
‘కూలీ’లో రజినీకాంత్‌తో పాటు సీనియర్ హీరోలు ఉపేంద్ర, నాగార్జున కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లో ముఖ్యమైన షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి బయల్దేరింది మూవీ టీమ్. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనుండగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మామూలుగా ఒక సినిమాలో చాలామంది అనుభవం ఉన్న నటీనటులను పెట్టి క్యాస్టింగ్‌తోనే మూవీకి హైప్ తీసుకొని రావడం లోకేశ్ కనకరాజ్ స్టైల్. ‘కూలీ’ విషయంలో కూడా అదే ఫాలో అవుతున్నాడు. మార్చిలో ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.