Satyabhama Today Episode January 11th : నిన్నటి ఎపిసోడ్ లో… వృద్దాశ్రమంలోని వాళ్లకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు రేణుక సత్యకు చెబుతుంది. నువ్వు వెళ్లి వాళ్ళని వెంటనే కాపాడాలని అంటుంది. దాంతో సత్య భయపడిపోయి కృష్ణ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. వృద్ధాశ్రమానికి తీసుకెళ్లమని నిజాలు నీకే తెలుస్తాయి అని అంటుంది. రేణుక దగ్గరకు రుద్ర వచ్చి కూర్చొని అక్కడి నుంచి సత్యకి కాల్ చేస్తాడు.. రేణుక చెప్పడంతో నీ మొగుడిని వెంటేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్లావు మరి ఇక్కడ ఉన్న మీ నాన్న సంగతి ఏంటి అని రుద్రా అంటాడు. నాన్నని ఏసేయడానికి ప్లాన్ చేశాను దాన్ని ఎవరు కాపాడతారని అనగానే సత్య షాక్ అవుతుంది. కార్ ని పక్కకుమని కృష్ణ అడుగుతుంది. కార్ ఆపగానే మా నాన్న ప్రమాదంలో ఉన్నాడు అనేసి అంటుంది. ఇకనుంచి మీ నాన్న దగ్గరికి వెళ్లాలంటే ఒక గంట పడుతుంది మరి వెళ్దామా అని క్రిష్ అంటాడు. ఇక సత్య హర్షి కి ఫోన్ చేసి నాన్న ప్రమాదంలో ఉన్నాడని కాపాడమని చెప్తుంది. క్రిష్ సత్య ఇద్దరు వృద్ధాశ్రమానికి వెళ్తారు. ఇక విశ్వనాథం బైక్పై బయట నుంచి వస్తుంటే రుద్ర విశ్వాన్ని చావు దెబ్బలు కొట్టమని అంటాడు రుద్ర.. హర్షకు విషయం చెప్పిన సత్య తండ్రిని కాపాడమని చెబుతుంది. ఇక సత్యకి సపోర్ట్ చేస్తామని చెప్పాం కదా యుద్ధం మొదలైంది అని చెప్తాడు. రౌడీల నుంచి తండ్రిని కాపాడి సత్యకి కాల్ చేసి నాన్న నా దగ్గరే ఉన్నారని కంగారు లేదని చెప్తాడు. సత్య వాళ్లు వృద్ధాశ్రామానికి వచ్చే సరికి పెద్దావిడను రౌడీలు తోసేస్తారు. ఆ ముసలావిడ చనిపోతుంది. ఎవరు ఎంత చెప్పినా మమ్మల్ని చంపిన పర్లేదు మేము మీకే సపోర్ట్ చేస్తామని ఆశ్రమంలోని ముసలి వాళ్లు అంటారు. కానీ సత్యం మాత్రం వాళ్ళని నాకు ఎవరు సపోర్ట్ చేయొద్దు నావల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దని అంటుంది. క్రిష్ కు కళ్లు తెరుచుకొనేలా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంత మంది బాగోగులు చూసుకుంటున్న ఈవిడను చంపేశారని అంటుంది. అందరినీ నేను తీసుకెళ్లిపోతాను ఎక్కడైనా తీసుకెళ్లిపోతా ఈ పెద్దావిడను బతికించమని అరుస్తుంది. రేపో మాపో నా పరిస్థితి ఇంతే అని ఆ పెద్దావిడ ప్లేస్లో నేనే నీ ఒడిలో శవంలా ఉంటానని నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం చేయలేవు అని అంటుంది. క్రిష్ షాక్ అయిపోతాడు. నువ్వు వెళ్లిపో క్రిష్ మీ అన్నయ్య మీ బాపు నిన్ను ఇక్కడ చూస్తే మరో ప్రళయం చేస్తారని అంటుంది. అక్కడున్న అందరికీ సత్య తన వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్తుంది. రాత్రి క్రిష్ మందు తాగుతూ సత్య మాటలు తలచుకొని ఉంటాడు. గదిలో సత్య ఏడుస్తుంటుంది. క్రిష్ మాత్రం ఏమి చేయలేకపోయాను నేను ఎంత చేతగాని వాడిని అంటూ బాధపడతాడు. విశ్వనాథంకు గాయం తగలడంతో అందరూ బాధపడతారు. మనము సత్యకు సపోర్ట్ చేయడం లేదు కదా మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అందరూ అనుకుంటారు. ఇక చేసేదేమీ లేదు సత్యకు సపోర్టుగా నిలవాలి ఏదైతే అది జరిగిందని విశాలాక్షి అంటుంది. సంధ్య మాత్రం సంజయ్ కి దూరమైన బ్రతకలేను ఎలాగైనా వీళ్ళని ఆపాలి అక్కని వెనక్కి తగ్గేలా చేయాలని అనుకుంటుంది.
జయమ్మ క్రిష్ దగ్గరికి వచ్చి ఏమైందిరా ఇంతగా తాగుతున్నావ్ ఎందుకంతగా బాధపడుతున్నావ్ నీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు ఎందుకు అని అడుగుతుంది. దానికి క్రిష్ చాలా బాధగా ఉంది బామ్మ.. నాన్న అన్నయ్య తమ స్వార్థం కోసం ఒక ముసలావిడని ప్రాణం తీసేసారు సత్య అది చూసి భయపడి పోయింది. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు బామ్మ అని బాధపడతాడు.. నీకు తప్పు అనిపించినప్పుడు వెళ్లి మీ బాబుని అడుగు అని జయమ్మ అంటుంది. కానీ నేను అడగలేదు బామ్మ. పేరును గుండెల మీద పచ్చబొట్టు పడిపెచ్చుకున్నాడు ఈ మాట గనక అడిగితే ఆయన గుండెలు పగిలిపోతాయి. అందుకే చేతకాక ఏమి చేయలేక ఇలా తాగుతున్నానని జయమ్మ తో అంటాడు. సత్యకు నువ్వు సపోర్ట్ చేయనంత కాలం ఇలానే జరుగుతుంది సత్యా గెలిస్తే వేరేలా ఉంటుందని మేమందరం సత్యకు సపోర్టుగా నిలిచాము. నువ్వు బాబుకి మాటిచ్చాను బామ్మ ఆ మాటను ఎప్పటికీ తప్పను.. అలాగే సత్యను ఎప్పటికీ ఓడిపోనివ్వను అని అంటాడు. ముసలావిడ చనిపోవడం తలుచుకొని సత్య బాధపడుతుంది. ఎలాగైనా ఈ రాక్షసుల నుంచి మిగతా వాళ్ళని కాపాడుకోవాలని నామినేషన్స్ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తుంది. ఇక అనుకున్నట్లుగానే అంగీకార పత్రాన్ని మహదేవయ్య యొక్క తీసుకొచ్చి ఇస్తుంది.
ఈ రావణ కష్టం ఇక ఆపండి నేను ఎలక్షన్స్ లో ఎప్పటికీ నిలబడును ఇది నా ఆమోద పత్రం నా స్వహస్తాలతో నేను రాసిన ఆమోదపత్రమని మహదేవయ్యకు ఒక లెటర్ ఇస్తుంది. అది చూసిన క్రిష్ షాక్ అవుతాడు. నావల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఇకమీదట ఏ ప్రాణం పోకూడదు నేను ఎలక్షన్స్ లో నిలబడితే నా ప్రాణమైన పర్లేదు కానీ నాకు సపోర్ట్ గా నిలిచిన వాళ్ళు ప్రాణం పోతే ఎలా ఉంటుందో ఆలోచించండి అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో నేను ఎప్పుడూ ఎలక్షన్స్ లో నిలబడను అని చెప్తుంది. సత్య ఎలక్షన్స్ లో నిలబడాలి సత్య గెలవాలి అని క్రిష్ సత్య నువ్వు రెచ్చగొడతాడు. మా బాపు మీద నిందలేసి పోతున్నావ్ నువ్వు చేతకాక ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటున్నావా అని క్రిష్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నన్ను క్షమించు సత్య నేను ఎలక్షన్స్ నుంచి తప్పుకోకుండా చేయడానికి నేను ఇలా మాట్లాడుతున్నానని క్రిష్ మనసులో అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..