BigTV English

AP Agriculture Budget : ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కేటాయింపులు ఎంతంటే?

AP Agriculture Budget : ఏపీ వ్యవసాయ బడ్జెట్.. కేటాయింపులు ఎంతంటే?

AP Agriculture Budget : ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.41,436 కోట్ల కేటాయింపులను ప్రతిపాదించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం పెంచే విధంగా ఆర్బీకే సేవలు అందిస్తున్నాయన్నారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను గ్రామస్థాయిలోనే అందిస్తున్నామని తెలిపారు. 8,837 ఆర్బీకే భవనాల నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉన్నాయన్నారు. ఆర్బేకేలను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. యూట్యూబ్‌ ఛానళ్లు, మాస పత్రికను ప్రారంభించామని మంత్రి కాకాణి వెల్లడించారు.


సాగు భళా : కాకాణి
వ్యవసాయరంగానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను కాకాణి వివరించారు. రాష్ట్రంలో 155 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. రైతులకు యూనివర్శల్‌ బీమా పథకం కల్పించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు. ఆర్బీకేల్లో 50 వేల టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నామని తెలిపారు. ఏపీ సీడ్స్‌కు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని తెలిపారు. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణ చేపట్టామన్నారు. చిరుధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు..

రైతులకు దన్నుగా..
రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.6940 కోట్ల సాయం
రైతు భరోసా, కిసాన్‌ యోజన కింద రూ.7,220 కోట్లు
విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు
ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువులు సరఫరా
రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు
9 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి
3.50 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు
డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారి చేసేలా చర్యలు
ఆర్బీకేల ద్వారా 10 వేల డ్రోన్లను రైతులకు పంపిణీ
చిరుధాన్యాల సాగు చేస్తే హెక్టార్‌కు రూ.6 వేల ప్రోత్సాహకం


AP Budget : ఏపీ బడ్జెట్ రూ. 2,79,279 కోట్లు.. కేటాయింపులు ఇలా..

Insomnia Problems : నిద్రలేమి సమస్యలను దూరం చేసే స్మార్ట్ ఫోన్స్..

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×