BigTV English

Kavitha: కవితతో ఢిల్లీ వెళ్లే నేతలు జాగ్రత్తగా ఉండాలా? సంతోష్ స్టే తెచ్చుకున్నారా?

Kavitha: కవితతో ఢిల్లీ వెళ్లే నేతలు జాగ్రత్తగా ఉండాలా? సంతోష్ స్టే తెచ్చుకున్నారా?

Kavitha: గురువారం ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈసారి ఆమె అరెస్ట్ అవుతారా? అనే చర్చ. ఇప్పటికే కవిత సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబునూ విచారించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ముగ్గురినీ ఎదురెదురుగా ఉంచి.. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై క్లారిటీ వస్తే.. అరెస్ట్ తప్పదని చెబుతున్నారు.


కవితకు మద్దతుగా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ తరలి వెళుతున్నారు. మంత్రి కేటీఆర్ హస్తిన వెళ్లారు. కొందరు మంత్రులు, పార్టీ నేతలు సైతం ఢిల్లీ బాట పట్టారు. అయితే, అలా కవిత కోసం ఢిల్లీ వెళ్తున్న బీఆర్ఎస్ నేతలంతా జాగ్రత్తగా ఉండాలంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. కవితతో పాటు ఢిల్లీ వెళ్లే నేతల జాతకాల చిట్టాను కూడా దర్యాప్తు సంస్థలు లాగుతాయని హితవు పలికారు.

అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన దగ్గర ఢిల్లీ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది. అలాంటి ఆయనే ఇలా అన్నారంటే ఏదో జరుగుతోందని అనిపిస్తోంది. నిజంగానే.. కవిత పరివారాన్ని, బీఆర్ఎస్ మంత్రులు, నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయా? ముందుముందు మరిన్ని దాడులు జరుగుతాయా? అనే చర్చ నడుస్తోంది.


ఎంపీ అర్వింద్ మరో బాంబు కూడా పేల్చారు. కేసీఆర్ వెన్నంటే ఉండే సమీప బంధువు, ఎంపీ సంతోష్ కుమార్ పైనా సంచలన కామెంట్లు చేశారు. సంతోష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అంటున్నారంటూ అర్వింద్ ఆయన టాపిక్ కూడా తీసుకురావడం కలకలం రేపుతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ దందాలన్నీ సంతోష్ కుమార్ కనుసన్నల్లోనే జరుగుతాయనే ప్రచారం ఉంది. ప్రగతి భవన్ కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిపేదంతా సంతోషే అంటారు. అలాంటి సంతోష్.. ఎందుకైనా మంచిదని కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారా? అర్వింద్ చెప్పిన మాటలు నిజమేనా? సంతోష్‌పైనా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందా? ఇలా అర్వింద్ వ్యాఖ్యలతో ఎన్నో అనుమానాలు.

Modi: మోదీ ఉత్తమ నటుడు.. ఆస్కార్‌కు పంపితే పక్కాగా అవార్డు..

wheat flour : గోధుమపిండిలో ఫంగస్.. ప్రాణాలకు ముప్పు..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×