E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 11th: రోహిణి మనోజ్ గురించి టెన్షన్ పడుతూ ఉండగా గుణ ఒక వీడియోని రోహిణికి పంపిస్తాడు. నీ మొగుడిని చూసావు కదా ఇక్కడే బార్లు తాగుతూ ఉన్నాడు తనని తీసుకొని వెళ్ళిపోతాను అని రోహిణిని బెదిరిస్తాడు గుణ. మనోజ్ ని ఏం చేయొద్దు నీకు కావలసిన డబ్బులే కదా నేను ఇస్తాను అని రోహిణి అంటుంది.. ఆ మాట వినగానే అయితే నువ్వు వెంటనే ఈ బార్ కి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి మనోజ్ ని తీసుకొని వెళ్ళు అని వార్నింగ్ ఇస్తాడు.. ఇక వీడియోని చూసిన వెంటనే ఇంట్లో పూజ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి రోహిణి మనోజ్ కి తన సంగతి చెప్తే కచ్చితంగా తనని చంపేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే మనూస్ ని కాపాడుకొని తీసుకొచ్చుకోవాలి అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది..

రోహిణికి దిమ్మతిరిగే

బాలు బారులోకి వెళ్లి.. ఏంట్రా నామీద కోపాన్ని మా అన్నయ్య మీద చూపించాలని అనుకుంటున్నావా ఎందుకురా మా మనోజ్ ని టార్గెట్ చేసావు అని గుణాన్ని పట్టుకుని చెంపలు వాయిస్తాడు. పదరా బయటికి నీ సంగతి చెప్తాను అని గుణాన్ని తీసుకెళ్తూ ఉండగా.. అప్పుడే రోహిణి సడన్గా బారికొస్తుంది అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఓ ఈ పాపంలో నీకు కూడా బాగా ఉంది అన్నమాట నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అనుమానం కలిగేలా మాట్లాడతాడు.. అయితే రోహిణి మనోజ్ గురించి నేను వచ్చాను వెతుక్కుంటూ అని చెప్తుంది కానీ బాలు మాత్రం అస్సలు నమ్మడు. రోహిణి ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటుంది.

రోహిణి పై ప్రభావతి సీరియస్..

Advertisement

రోహిణి ఇంట్లోకి రాగానే ప్రభావతీ రచ్చ రచ్చ చేస్తుంది.. పూజ కోసం నిన్న అంత సిద్ధం చేయమంటే నువ్వేంటి ఎక్కడికి వెళ్లావు రాజు కార్యాలు వెలకబెట్టడానికి వెళ్ళావా అంటూ ప్రభావతి రోహిణి గుక్క తిప్పుకొని ఇవ్వకుండా మాట్లాడి అరుస్తుంది. అయితే రోహిణి మాత్రం నేను బార్ కి వెళ్ళాను అత్తయ్య అని చెప్పగానే ప్రభావతి తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. బార్కు వెళ్ళావా ఇంట్లో పూజ జరుగుతుంటే నువ్వు చేసిన పని ఏంటి కొంచమైనా నీకు సిగ్గుందా అంటూ ప్రభావతి రచ్చ రచ్చ చేస్తుంది. వెంటనే బాలు కూడా ఇంట్లోకి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది ప్రభావతి.. నేను కూడా బార్ కి వెళ్లొచ్చాను అని చెప్పగానే ప్రభావతి తో పాటు మీనా అందరు కూడా బారుకి వదిన మరిది కలిసి వెళ్లి తాగి రావడమేంట్రా అని ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఎందుకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము తెలుసుకోకుండా ఏం మాట్లాడుతున్నావు అని బాలు అంటాడు..

మనోజ్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

ఎందుకు వెళ్లారు బారుకు అని సత్యం అడగగానే మేము వెళ్ళలేదు నాన్న మనోజ్ బార్ కి వెళ్తే అక్కడ వాడిని ఎక్కడ పోలీసులు తీసుకుని వెళ్తారు అని ఇంటి పరువు పోకుండా తీసుకుని వచ్చాము అని చెప్తాడు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు అని బాలుని అంటాడు.. నాకు కూడా మనసు ఫోన్ చేస్తే తాగకుండా ఆపడానికి నేను బార్కు వెళ్లాను మావయ్య అని రోహిణి అంటుంది.. అయితే ఏం మనోజ్ ఎక్కడ అని అడిగితే ఇంట్లోకి పాక్కుంటూ రావడంతో అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మనోజ్ కి పరిస్థితి రావడానికి కారణం రోహిణి నేనే అందరూ అనుకుంటారు. రోహిణి వల్లే మనోజ్ ఇలా తాగుబోతు లాగా తయారయ్యాడు అని ప్రభావతి బాధపడిపోతుంది ఇక ఆశీర్వదించమంటే మనోజ్ వెళ్లి రోహిణి కాళ్లు పట్టుకుంటాడు అది చూసిన ప్రభావతి ఇంకాస్త రెచ్చిపోతుంది. అలా మొత్తానికి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం పూర్తి అయిపోతుంది..

బాలు మీనా కౌంటర్స్..

Advertisement

బాలు మీనా రాత్రి పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు మీ అన్నయ్య బార్ కి వెళ్ళిన విషయం రోహిణికి ఎలా తెలిసింది ఎందుకు ఆమె బార్ కి వెళ్ళింది అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రోహిణి పై అనుమానం వస్తుంది. మనోజ్రోహిణికి అసలు ఫోనే చేయలేదంట కానీ రోహిణి మాత్రం బార్కొచ్చింది అక్కడ గుణ గాడు ఉండడంతో నాకు కాస్త అనుమానం కూడా మొదలైంది అంటూ బాలు అంటాడు.. అయితే అసలు రోహిణి ఎందుకు వెళ్ళింది అన్న అనుమానం వాళ్ళిద్దరికీ వస్తుంది గుణ వల్లే రోహిణి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటారు ఏది ఏమైనా కూడా రోహిణి మీద మాత్రం అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. ఇకపోతే మీనా సింగరాజు దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని వచ్చి ఆ ఆర్డర్ ని పూర్తి చేయాలని అనుకుంటుంది.. సింగరాజు చెప్పిన మాట విని మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి చింతామణి భర్త సింగరాజు అని మీ నాకు తెలుస్తుందా..? మౌనిక కాపురం గురించి ప్రభావతి వాళ్ళింట్లో అందరికీ తెలిసిపోతుందా అన్నది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్లో చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది…

Also Read :Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

Big Stories

Advertisement
×