E-Paper
Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..
Advertisement

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏయే జిల్లాలకు వర్షాలు పడతాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెబుతోంది. కానీ ఎల్‌నినో మాత్రం చినుకులు పడకుండా చేస్తోంది. ఇప్పటికే రెండు అల్పపీడనాలు తేలిపోయాయి. తాజాగా మూడో అల్పపీడనం గురించి ప్రజలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఏపీ, తెలంగాణల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనునున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా 9.4 కిలోమీటర్ల ఎత్తులో సైక్లోనిక్ సర్క్యులేషన్ విస్తరించి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్నట్లు ప్రస్తావించింది.

ఉత్తరాంధ్రలో శుక్ర, శనివారాల్లో వర్ష సూచన

Advertisement

ఏపీలోని ఉత్తరాంధ్రలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన చేసింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి గరిష్ఠంగా 60 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశముందని అంచనా వేసింది. అదే సమయంలో అలలు ఎగసిపడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రంలో ఉన్నవారు వెనక్కి తిరిగి రావాలని సూచన చేసింది.

ఆయా జిల్లాలకు బిగ్ అలర్ట్

శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెదురు ముదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేసింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

Advertisement

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాలైన సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసింది.

అర్ధరాత్రి నుండి తెల్లవారుజామువరకు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల వర్షపాతం 60 నుంచి 70 మి.మీ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడ వర్షాలు, జల్లులు పడే అవకాశముందని తెలియజేసింది.

ALSO READ: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

Related News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

Big Stories

Advertisement
×