E-Paper
Advertisement

ప్రమాదానికి గురైన పెళ్లి కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, కొత్త దంపతులకు గాయాలు, ప్రకాశం జిల్లాలో ఘటన

ప్రమాదానికి గురైన పెళ్లి కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, కొత్త దంపతులకు గాయాలు, ప్రకాశం జిల్లాలో ఘటన
Advertisement

Road Accident: ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు స్పాట్‌లో మృతి చెందారు. కారులోని కొత్త దంపతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? పోలీసులు ఏం చెబుతున్నారు?

ప్రకాశం జిల్లాలో ఘోర ఘటన

ప్రకాశం జిల్లాలోని పెళ్లూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును బలంగా ఢీకొని, సైడున ఉన్న కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. సీట్ల కింద వారంతా నుజ్జు నుజ్జు అయ్యారు. తిరుమల స్వామి దర్శనం తర్వాత బాపట్ల వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు.

స్పాట్‌లో నలుగురు మృతి, కొత్త దంపతులు సేఫ్

Advertisement

డ్రైవర్‌ ప్రవీణ్‌, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి మరణించారు.  కొత్త దంపతులు శ్రీతేజ-కౌశల్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అంబులెన్సు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన నూతన దంపతులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తు వల్ల జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాపట్ల జిల్లాలకు చెందిన శ్రీతేజ-కౌశల్య నవంబర్ 18న రాత్రి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత 19న రాత్రి తిరుమలకు బయలుదేరారు. 20న దర్శన తర్వాత అక్కడి నుంచి బాపట్ల వస్తుండగా ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరో గంటల సమయంలో ఇంటికి చేరుకుంటామని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగిందని అంటున్నారు. మృతి చెందిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం విషాదచాయలు అలముకున్నాయి.

Advertisement

ALSO READ: సామాన్యుడికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇక ఆ ధరలకు కళ్లెం పడినట్లే!

 

Related News

సామాన్యుడికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇక ఆ ధరలకు కళ్లెం పడినట్లే!

విశాఖకు బే-టెక్ హంగులు.. సైబరాబాద్ తరహాలో అభివృద్ధి.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

ఏపీని చంద్రబాబు 100 ఏళ్లు వెనక్కి నెట్టేశారు.. రేపు గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: బొత్స సత్యనారాయణ

బద్వేల్ ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం.. ఆఫీస్ గదిలో 12 అడుగుల గుంత తవ్వి..

రూ.7.8 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ!

తాడిపత్రిలో కవ్వింపు చర్యలు.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, భారీగా బలగాలు మోహరింపు

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

Big Stories

Advertisement
×