Podarillu Madhav : స్టార్ మా ఛానల్ లో ఎన్నో సీరియల్స్ ప్రసారమైతే వస్తున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మాత్రమే సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో పొదరిల్లు సీరియల్ కి క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.. ప్రతిరోజు సీరియల్ లో ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకోవడంతో డిమాండ్ కూడా ఈ సీరియల్ కి పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ రేటింగ్ కూడా భారీగా పెరగడంతో సీరియల్ ని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. నిన్న మొన్నటి వరకు పెద్దోడుగా సలహాలు ఇచ్చిన మాధవ్ ఇప్పుడు ప్రేమలో పడిపోవడంతో సీరియల్ కాస్త ఆసక్తిగా మారింది. పెద్దోడు ప్రేమలో పడిన తర్వాత పూర్తిగా మారిపోయాడు అని సోషల్ మీడియా వేదికగా సీరియల్ ఫాన్స్ కామెంట్లు కూడా పెడుతుంటారు. తాజాగా పెద్దోడి స్టైలిష్ లుక్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలలో పొదరిల్లు పెద్దోడు ఎలా ఉన్నాడో ఒకసారి చూసేయండి..
స్టార్ మా చానల్లో సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఐదుగురు మగాళ్లున్నావు ఇంటికి ఒక ఆడపిల్ల కోడలుగా వెళితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆ సీరియల్ స్టోరీ.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి ఆ ఇంట్లో పెద్దదిక్కుగా పెద్ద కొడుకు అయినా మాధవ్ తోడుగా ఉంటాడు.. తన సపోర్టును చూసుకున్న మహాలక్ష్మి తన్ని ఒక మంచి వ్యక్తిగా భావిస్తూ ఉంటుంది. అంతేకాదు తనని ప్రేమగా పెద్ది అని పిలుచుకుంటుంది. ఆ పెద్ది ఏం చెప్తే అదే తనకు మంచి చేస్తుంది అని భావిస్తూ ఉంటుంది అలాంటి పాత్రలో నటిస్తున్న మాధవ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మరి ఈ మాధవ్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. స్టైలిష్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి అందులో మాధవ్ ఎలా ఉన్నాడో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి..
పొదిరిల్లు సీరియల్ లో మాధవ పాత్రలో నటిస్తున్నాడు అజయ్ సత్యనారాయణ అలియాస్ అజయ్ గౌడ.. ఈయన ఒక కన్నడ నటుడు.. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతంలో నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో కూడా ఈ హీరో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. అయితే ఈయనకు తెలుగులో ఇది రెండవ సీరియల్ కావడంతో రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం అందరికీ తెలుసు.. ప్రస్తుతం ఈయనకు ఈ సీరియల్లో నటిచ్చినందుకుగాను ఒక్కరోజుకి 35 వేలకు పైగా అనే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈయన తెలుగు తో పాటుగా వేరే ఇండస్ట్రీలలో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారని తెలుస్తుంది మరి ఈ లెక్కన పెద్దోడు రెండు చేతుల సంపాదిస్తూ బిజీగానే ఉన్నాడు.
Also Read : వింధ్య ఒక్క షోకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..?