Mouni Roy:సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలదొక్కుకోవాలి అంటే నటనతో పాటు అందం కూడా ముఖ్యమే అని, ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా.. అందంగా ఉంటే సరిపోదు. ఆ అందానికి తగ్గట్టు ప్రతిభ కూడా ఉండాలి అని, మరికొంతమంది నిరూపిస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలి అంటే.. రూపలావణ్యంతో పాటు గ్లామర్ కూడా తప్పనిసరి. అందుకే తమను తాము అందంగా మార్చుకోవడానికి ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోయిన్లను మొదులుకొని.. నేటి యువతరం హీరోయిన్ల వరకు ఎంతోమంది సర్జరీలు చేయించుకొని మరీ తమ అందాన్ని మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న మౌనీ రాయ్ కూడా సర్జరీ చేయించుకుందని అసలు విషయాన్ని బయట పెట్టారు ఆమె మాజీ భర్త సూరజ్ నంబియార్ (Suraj Nambiar).
ప్రముఖ వ్యాపారవేత్త అయిన సూరజ్ నంబియార్ తో దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన మౌని రాయ్ పెద్దల అంగీకారంతో 2022 జనవరి 27న గోవాలో మలయాళీ, బెంగాలీ సాంప్రదాయ పద్ధతులలో వివాహం చేసుకున్నారు. తర్వాత నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా కొనసాగిన ఈ 2026 మే నెలలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే చిత్ర పరిశ్రమంలో క్యూట్ జోడీలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ.. ఇలా వివాహమైన నాలుగేళ్లకే విడిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఏమైంది అంటూ పలు రకాలుగా చర్చించారు కూడా.
ఇకపోతే విడాకుల తర్వాత ఎవరికివారు తమ కెరియర్ పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్గా మౌని రాయ్ సర్జరీ పై సూరజ్ నంబియార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ముఖ్యంగా మునుపటి ఫోటో కూడా వైరల్ కావడంతో ఆమె లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి సూరజ్ నంబియార్ చేసిన కామెంట్లు ఏమిటి అనే విషయానికొస్తే.. “మౌని రాయ్ తన కెరీయర్ ను టీవీ పరిశ్రమ ద్వారానే ప్రారంభించింది. అయితే ఆ సమయంలో ఆమె అందం కారణంగా ఎక్కువగా ఆఫర్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో సర్జరీ కోసం ఒక విదేశీ వైద్యుడిని సంప్రదించింది. ఆ సర్జరీ చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, దాని వెనుక ఉన్న ఇబ్బందులను కూడా డైరెక్టర్ ఆమెకు హెచ్చరించారు. అయినా సరే ఆమె రిస్క్ చేసి మరీ ఆ నిర్ణయం తీసుకొని సర్జరీ చేయించుకుంది. ముఖ్యంగా వైద్యులు ఆమెకు పదిసార్లు ప్రయత్నించి, చివరికి ఆ రూపాన్ని తీసుకొచ్చారు” అంటూ అసలు విషయం బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు సూరజ్ నంబియార్.
also read:దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రకటన.. విన్నర్స్ ఎవరంటే?
మౌని రాయ్ విషయానికి వస్తే.. గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే సీరియల్ లో కృష్ణ తులసి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే నాగిని సీరియల్ లో శివన్యా, శివాంగి పాత్రలు పోషించిన ఈమె.. మహాదేవ్ లో సతీదేవి పాత్ర కూడా పోషించి మెప్పించింది. అలా సీరియల్స్ తో తన కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ప్రత్యేక పాటలలో కూడా ఆకట్టుకుంది. అటు కీలకపాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె విశ్వంభర సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ తో తెలుగు ఆడియన్స్ ను అలరించబోతోంది.