BigTV English

Nara Lokesh: ఫేక్ కి ఫ్యాక్ట్ కి తేడా తెలియని ఎంపీ గారూ.. తప్పుడు ప్రచారం మానుకోండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్

Nara Lokesh: ఫేక్ కి ఫ్యాక్ట్ కి తేడా తెలియని ఎంపీ గారూ.. తప్పుడు ప్రచారం మానుకోండి.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్

Nara Lokesh vs Guru Moorthy: ఏపీ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. ఒకవైపు పాలనా భాద్యతల్లో ఉంటున్న నారా లోకేష్.. మరోవైపు ప్రజాదర్బార్ నిర్వహిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల లోకేష్ స్పీడ్ పెంచి, వైసీపీపై విమర్శల ఘాటు పెంచారు. తాజాగా రెడ్ బుక్ ఓపెన్ అంటూ ప్రకటించిన లోకేష్.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అలాగే నేరుగా ఫేక్ ప్రచారం మానుకోవాలని వైసీపీ ఎంపీకి ఝలక్ ఇచ్చారు లోకేష్.


తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎక్స్ వేదికగా.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తుందని, ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ప్రమాదంలో ఉందంటూ విమర్శించారు. ఆరోగ్యశ్రీ కింద 3257 వ్యాధులు కవర్ చేయబడ్డాయని, వాటిని 1949కి తగ్గించడానికి కూటమి ప్రయత్నిస్తోందంటూ తెలిపారు. దీనిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్ కూడా ఎక్స్ వేదికగా.. ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తేడా తెలియని ఎంపీ గారూ.. మీ హయాంలో పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిల్ని కూడా మేం చెల్లిస్తున్నామంటూ హితవు పలికారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు తగ్గించారని, పథకాన్నే నిలిపివేస్తున్నారనే తప్పుడు ప్రచారంలో గురుమూర్తి కూడా భాగమయ్యారు. ఇకనైనా వీటిని మానుకోండి. మీ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే పనిలో మా ప్రభుత్వ సహకారం తీసుకోండి. అప్పుడు ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేసిన వారవుతారు’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ నుంచి వైసీపీ కార్యకర్త వరకు అందరూ ఫేక్ ప్రచారమే ఆయుధంగా రాజకీయాలు చేస్తున్నారంటూ లోకేష్ ట్వీట్ చేస్తూ… ఎంపీకి ట్యాగ్ చేశారు.


Also Read: Deepak Reddy on Kodali Nani: కొడాలి నాని దాక్కున్నాడు.. ప్రజల చేతుల్లో పడితే ‘అంకుశం’ సినిమానే.. దీపక్ రెడ్డి

అలాగే మీడియాతో లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల ఫేక్ ప్రచారాలు అధికంగా సాగుతున్నాయని, ఇలా ఫేక్ ప్రచారాలను చేసే వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. అలాగే తమ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుందని, కానీ వైసీపీ ఓర్వలేక విమర్శలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అబద్దాలు వీడి, వాస్తవాలు గ్రహించాలన్నారు. తమ రెడ్ బుక్ లో గల ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు.

గతంలో వైసీపీ నేతలపై విమర్శలు చేయడంలో ఆచితూచి వ్యవహరించే లోకేష్.. ఇటీవల స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. అందులో భాగంగా ఎక్స్ వేదికగా విమర్శించిన తిరుపతి ఎంపీకి ఫేక్ ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఇక సోషల్ మీడియా వేదికగా.. ఫేక్ ప్రచారాలు సాగిస్తే సహించమని హెచ్చరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×