E-Paper
Advertisement

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ… ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేసే మూవీ

OTT Movie : క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ… ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేసే మూవీ
Advertisement

OTT Movie : ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ పుణ్యమా అని మలయాళ సినిమాలకు మంచి క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఓటీటీలో ఈ కంటెంట్ కు ఆదరణ ఎక్కువైంది. ఈ సినిమా తర్వాత అప్పటికే ఓటీటీలో ఉన్న సినిమాలను సైతం చూడడం మొదలు పెట్టారు జనాలు. ఇక ఇప్పుడైతే ఓటీటిలో రిలీజ్ కాబోతున్న మలయాళ సినిమాలపై ముందే ఒక కన్నేసి ఉంచుతున్నారు. పైగా ఆ సినిమా ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతుందో డేట్ ను లాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అలా మలయాళ సినిమాలంటే పిచ్చిగా ఇష్టపడే వారి కోసం ఈ మూవీ సజెషన్. పైగా ఇదొక మర్డర్ మిస్టరీ. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

Advertisement

మలయాళ సినిమాలు అంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కంటెంట్ బేస్డ్ సినిమాలకు పెట్టింది పేరు మాలీవుడ్. ఇక వాళ్ళు తీసే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎలా ఉంటాయో ఇప్పటికే మలయాళ సినిమాలను చూస్తున్న వారికి తెలిసే ఉంటుంది. రియాలిటీ కి దగ్గరగా ఉంటూనే సినిమా చూస్తున్నంత సేపు ఆసక్తికరంగా నడిచే ఈ మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

ఒక కార్పొరేట్ కార్యాలయంలో హత్య జరుగుతుంది. ఎస్పీ సందీప్ కృష్ణ ఈ సినిమాను దర్యాప్తు చేస్తూ ఉంటారు. అయితే ఆ పోలీస్ అధికారికి కేస్ తో సంబంధం లేని కొన్ని ఆధారాలు హత్య జరిగిన అదే ప్లేస్ లో దొరుకుతాయి. ఆ దర్యాప్తు చేస్తున్న టైంలోనే పోలీస్ ఆఫీసర్ దొరికిన ఆ ఆధారాలను పజిల్ లాగా ఒక్కొక్కటిగా కలుపుతూ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి ఈ పోలీస్ ఆఫీసర్ నిందితుడిని పట్టుకోగలిగాడా ? అసలు మర్డర్ జరిగిన ప్లేస్ లో దానికి సంబంధం లేకుండా వేరే ఆధారాలు ఎందుకు దొరికాయి? కేసును ఎలా సాల్వ్ చేశారు ? అనేది తెలియాలంటే ‘గోలం‘ అనే ఈ సినిమాను వీక్షించాల్సిందే. అయితే సినిమా మొత్తం కొత్త నటీనటులతో రూపొందింది. నటినటులే కాదు డైరెక్టర్ కూడా కొత్తవాడే కావడం విశేషం. సంజీద్ పిఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడంతో కమర్షియల్ గా సినిమా సక్సెస్ అయ్యింది. జూన్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. అయితే డిసప్పాయింట్మెంట్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ సినిమా కేవలం మలయాళ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. మరి తెలుగులో ఈ మూవీని ఎప్పుడు డబ్ చేస్తారు ? అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ఒకవేళ భాష అడ్డు కాదు అనుకునేవారు ఈ సినిమాను సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ ను ముఖ్యంగా మలయాళ సినిమాలను ఇష్టపడే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×