BigTV English

Minister Savita Helped Accident Victims: మానవత్వం చాటుకున్న మంత్రి.. రోడ్డుపై వెళ్తుండగా..

Minister Savita Helped Accident Victims: మానవత్వం చాటుకున్న మంత్రి.. రోడ్డుపై వెళ్తుండగా..

Minister Savita Helped to Road Accident Victims: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు ఏపీకి చెందిన మంత్రి సవిత. అంతేకాదు.. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలిసి ప్రజలు ఆ మంత్రిని అభినందింస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చోసుకుంది. ఆటోను కారు ఢీకొన్నది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.


అయితే, అదే మార్గంలో అటుగా వెళ్తున్న మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించి.. వెంటనే తన కాన్వాయ్ ని ఆపారు. అనంతరం అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన ప్రజలను మంత్రి సవితను అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కువైట్ లో వేధింపులకు గురైన ఓ కార్మికుడి వీడియోపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వేధింపులకు గురైన వ్యక్తిని గుర్తించినట్లు చెప్పారు. ఎన్ఆర్ఐ టీడీపీ బృందం బాధితుడిని సంప్రదిస్తుందని తెలిపారు. కేంద్రం సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు.


Also Read: బాబుతో జరిగిన భేటీలో ఇదే చర్చించాం: మహారాష్ట్ర సీఎం ట్వీట్

కువైట్ లో దుర్భర జీవితం గడుపుతున్నామని ఇటీల ఓ తెలుగు కార్మికుడు వీడియో చేస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. సాయం చేయకపోతే చావే దిక్కంటూ ఆ వీడియోలో తన గోడు వెల్లబోసుకున్నాడు. దీనిపై స్పందించిన లోకేశ్ అతడిని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×