BigTV English

Crime in Tirupati: ప్రేమ పేరుతో ఒకడు.. దెయ్యం పట్టిందని మరొకడు.. మైనర్ పై ఉన్మాదం!

Crime in Tirupati: ప్రేమ పేరుతో ఒకడు.. దెయ్యం పట్టిందని మరొకడు.. మైనర్ పై ఉన్మాదం!

Tirupati Crime News


Tirupati girl physically harassed by two men: తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై ఇద్దరు వ్యక్తులు ఉన్మాదానికి పాల్పడ్డారు. లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

అభిరామ్‌ పేరుతో పరిచయమైన మహమ్మద్ షఫీ అనే యువకుడితో బాధితురాలు ప్రేమలో పడింది. బాలికకు దెయ్యం పట్టిందని.. ఆమే తల్లిదండ్రులకు కొందరు సలహా ఇచ్చారు. దీంతో.. రేణిగుంటలోని రాజరాజేశ్వరీ ఆశ్రమం స్వామిజీని పేరెంట్స్‌ ఆశ్రయించారు. బాలిక మానసిక స్థితి బాగోలేదని.. అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలని చెప్పి.. మైనర్‌పై ఆశ్రమ నిర్వహకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్వామీజీ వ్యవహారాన్ని పేరెంట్స్‌కు కాకుండా.. ప్రియుడు మహమ్మద్ షఫీకి సదరు మైనర్ బాలిక చెప్పింది.


మూర్తిస్వామి దొంగ అవతారాన్ని బయటపెడతానని షఫీ బాధితురాలిని నమ్మించాడు. ఇద్దరు స్నేహితుల సాయంతో ఆశ్రమం నుంచి మైనర్ బాలికను మహ్మద్ షఫీ తీసుకెళ్లాడు. ఆశ్రమంలో కూతురు కన్పించకపోవడంతో.. బాధితురాలి పేరెంట్స్‌ గాజుల మండ్యం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చర్చలు..

మైనర్ బాలికను నెల్లూరు, హైదరాబాద్‌, మంచిర్యాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు షఫీ. షఫీ తీరుపై అనుమానం వచ్చిన మైనర్.. అతని ఆధార్ కార్డు పరిశీలించింది. తాను ప్రేమించింది అభిరామ్‌ను కాదని మహమ్మద్ షఫీ అని తెలుసుకుని పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చింది. మోసపోయిన తీరును తల్లిదండ్రులకు చెప్పుకుంది.

బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. మైనర్ బాలికను రేణిగుంటకు తీసుకొచ్చారు. అలాగే, మహమ్మద్ షఫీతో పాటు మరో ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ షఫీ, ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామీజీలపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. రాజరాజేశ్వరి దేవి ఆలయం స్వామిజీ మూర్తి పరారీలో ఉన్నారు అని పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×