BigTV English

Bus Accident In UP: బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం

Bus Accident In UP:  బస్సుపై తెగి పడిన హైటెన్షన్ వైరు.. ప్రయాణికులు సజీవ దహనం

Bus Accident In UP


Bus Accident In UP: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గాజీపూర్ జిల్లాల్లో బస్సుపై హైటెన్షన్ కరెంట్ వైరు తెగి పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు 35 మంది పెళ్లి బృందంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంత సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని గాజీపూర్ జిల్లా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

బస్సులో మంటల చెలరేగగానే స్థానికులు స్పందించారు. వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బస్సు దగ్ధమైంది.


Read More: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదం.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్..

ప్రమాద సమయంలో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆరుగురి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. ఈ బస్సు ప్రమాదంతో పెళ్లింట విషాదం నెలకొంది.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×