E-Paper
Advertisement

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?

Dorababu Pendem : పెండెం దొరబాబు బలప్రదర్శన.. పిఠాపురం సీటుపై జగన్‌ పునరాలోచిస్తారా..?
Advertisement

Dorababu Pendem : ఇన్‌ఛార్జిల మార్పుతో వైసీపీలో పొలిటికల్ కాక రేగుతోంది. ఆ పార్టీలో ధిక్కార స్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. దాదాపు 50 వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే జన్మదిన వేడుక బలప్రదర్శనకు వేదికైంది.

పిఠాపురం సీటుపై సీఎం జగన్‌ పునరాలోచించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టుందని.. దాదాపు 50వేల మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. పిఠాపురం టికెట్‌ మళ్లీ తనకే ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. సీఎం జగన్ ఆలోచించి తనకే సీటు ఇస్తారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

ఎమ్మెల్యే దొరబాబు జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్‌ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను.. పిఠాపురం పార్టీ ఇన్‌ఛార్జిగా అధిష్ఠానం నియమించింది. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×