BigTV English

PM Narendra Modi : మోదీ నాసిక్ టూర్.. కాలారామ్ ఆలయంలో శ్రమదానం.. పారాయణం..

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర నాసిక్‌లో పర్యటించారు. నాసిక్‌లోని తపోవన్‌ మైదానంలో జాతీయ యూత్‌ ఫెస్టివల్‌లో యువతను ఉద్దేశించి నరేంద్రమోదీ ప్రసంగించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలకుల చేతిలో బానిసత్వం అనుభవించిన భారత్‌ ప్రజలకు నూతన ఉత్సాహం ఇచ్చిన స్వామి వివేకానంద‌కి ఈ రోజు అంకితం అని ప్రకటించారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతిని యువతతో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

PM Narendra Modi :  మోదీ నాసిక్ టూర్.. కాలారామ్ ఆలయంలో శ్రమదానం.. పారాయణం..

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర నాసిక్‌లో పర్యటించారు. తపోవన్‌ మైదానంలో నిర్వహించిన జాతీయ యూత్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపారు. వలస పాలకుల చేతిలో బానిసత్వం అనుభవించిన భారత్‌ ప్రజలకు నూతన ఉత్సాహం ఇచ్చిన స్వామి వివేకానంద‌కు ఈ రోజు అంకితం అని ప్రకటించారు. స్వామి వివేకానంద జయంతిని యువతతో జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.


భారత దేశ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందని మోదీ అన్నారు. యువత స్వతంత్ర ఆలోచనలతో ముందుకు సాగితే దేశ లక్ష్యాలు నేరవేర్చుకోవచ్చని ఆధ్యాత్మిక గురువు శ్రీఅరబిందో బోధించేవారని గుర్తుచేశారు. ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా నిలిచిందన్నారు. అందరు సమిష్టిగా పని చేసి భారత్ ను మూడో ఆర్థికశక్తిగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలో యువత నైపుణ్యాలకు కొదవ లేదన్నారు. భారత్ యువత ప్రపంచంలో అన్ని చోట్ల తమ ప్రతిభను చూపిస్తున్నరన్నారు. యోగా, ఆయుర్వేద రంగాలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా యువత మారుతున్నారని ప్రశంసించారు. తొలిసారిగా ఓటు వేసే యువత కొత్త అభివృద్ధిని సృష్టిస్తారని పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ మాతృమూర్తి రాజమాత జిజియా బాయి జయంతి కూడా ఈ రోజే అని మోదీ గుర్తు చేశారు. ఆమె ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని ప్రశంసించారు. భారత్ అభివృద్ధిలో మహారాష్ట్ర మహానీయులు కీలక పాత్ర వహించారన్నారు. నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో శ్రీరాముడు చాలాకాలం నివసించారని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలను కోరారు.


నాసిక్‌లోని ప్రసిద్ధ కాలారామ్‌ ఆలయ పరిసరాల్లో నరేంద్ర మోదీ శ్రమదానం చేశారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేయనున్న నేపథ్యంలో ప్రత్యేక అనుష్ఠానం అనుసరిస్తానని మోదీ ప్రకటించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×