BigTV English

Vizag Politics : రసవత్తరంగా విశాఖ రాజకీయం.. డైలమాలో వైసీపీ ?

Vizag Politics : రసవత్తరంగా విశాఖ రాజకీయం.. డైలమాలో వైసీపీ ?

Vizag MLC and GVMC Elections: విశాఖ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో అక్కడి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీకి 585 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నా.. ఆ పార్టీ నేతలు భయం భయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే 237 ఓట్లు ఉన్న టీడీపీ.. మరో 200 ఓట్ల కోసం కసరత్తులు చేస్తోంది. టీడీపీతో 200మంది వైసీపీ ఓటర్లు టచ్ లో ఉన్నారని బహిరంగ ప్రకటన చేశారు ఆ పార్టీ నేత గండి బాబ్జి.


Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి అధికారికంగా అంత్యక్రియలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే.. ప్రతి పార్టీకి 415 ఓట్లు అవసరం. ఓట్ల పరంగా వైసీపీనే ముందంజలో ఉంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కౌన్సిటర్లు, కార్పొరేటర్లు ఎదురు తిరగడంతో వైసీపీ అధిష్టానం డైలమాలో పడిపోయింది. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడడంతో అధిష్టానంలో భయం మొదలయింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయితే.. వైసీపీ ఓటమి ఖాయం అవుతుంది. ఈ క్రమంలో 8 నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లతో జగన్ భేటీ అయ్యారు. నిన్న రాత్రి విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, కీలకమైన కార్పొరేటర్లు విజయవాడలో జగన్ ను రహస్యంగా కలిశారు. జగన్ వారిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే రెండు పార్టీలు మాత్రం ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×