Nizamabad Girls: పూటకో దాడి, రోజుకో అత్యాచార యత్నం జరిగే ఈ రోజుల్లో యువతుల రక్షణకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇంకా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఆ జిల్లా యువతుల జోలికి వెళ్లే వారు కాస్త ఆలోచించాల్సిందే. లేకుంటే మంచానికి పరిమితం కావడం ఖాయం. ఇంతకు ఆ జిల్లా ఏమిటి? ఆ యువతుల ఆయుధం ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.
ర్యాగింగ్ భూతం
నేటి సమాజంలో ఆడపిల్ల భద్రత అన్నది పెద్ద అంశం. పూర్వపు రోజులకు, నేటికీ ఈ విషయంలో చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. కొందరు మృగాల నిర్వాకాలతో ఆడపిల్లల భద్రతా అంశం ఏదొక రూపంలో వెలుగులోకి వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. అయితే స్వీయ రక్షణ అన్నది నేటి సమాజపు యువతులకు అవసరం. అందుకే ఆ తీరున మనం ఆలోచించాల్సిన అవసరమొచ్చింది.
కర్రసాము.. కరాటే
ఉదాహరణకు ఒక యువతి దారి వెంబడి వెళుతోంది. అప్పుడే ఇద్దరు అల్లరి మూకలు అక్కడికి చేరుకున్నారు. ఆ యువతి బెదరలేదు.. అదరలేదు. ఒక్క చేత్తో ఇద్దరినీ మట్టుబెట్టి, పోలీసులకు అప్పగించింది. దీనికి కారణం ఆ యువతి తల్లిదండ్రులు ఆమెకు స్వీయ రక్షణపై శిక్షణ అందించడమే. అందుకే నేటి సమాజపు యువతులకు కర్రసాము, కరాటే వంటి విద్యలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వంటింటికి పరిమితం కాదు
ఆడపిల్లలు వంటింట్లో కి పరిమితం కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మ రక్షణ కోసం వారికి వారు ఏ క్షణమైన ఏం జరిగినా కాపాడుకునే నైతిక శక్తి సెల్ఫ్ స్ట్రెంత్ కోసం ప్రాచీన కలను ఎంచుకుంటున్నారు. నేటి బాలల రేపటి పౌరులు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను వారి కట్టాలంటే బాలికల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ జిల్లా యువతుల జోలికి వెళితే..
జాతీయ స్థాయి అవార్డులు పొందాలన్నా ఆ స్థాయిలో గుర్తింపు రావాలన్నా నిజామాబాద్ జిల్లా యువతులకు సాధ్యం అనడానికి ఇదిగో నిదర్శనం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల భవన్ వేదికగా కర్ర సాములో బాలికలకు మెళకువలు నేర్పుతున్నారు. దీంతో బాలికల్లో మనోధైర్యం పెరుగుతుంది. ప్రాచీన కళ అయిన కర్ర సాము నేర్చుకోవడం వల్ల మనో ధైర్యం పెరగడమే కాక, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.
ఇప్పటికే జిల్లా నుంచి వందలాది మంది కర్ర సాము నేర్చుకొని ఇతర రాష్ట్రాల్లో శిక్షణలు ఇస్తున్నారు. కర్ర సాములో జాతీయస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు పొందిన వారు జిల్లా నుంచి 20 మందికి పైగా అవార్డులు పొందారు. ప్రతి సమ్మర్ క్యాంపు లో 2 వందల మంది కి పైగా కర్ర సాము లో శిక్షణ పొందుతున్నారు. ప్రాచీన కళ అయిన కర్ర సామును జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ఉంచాలని, ఇది విదేశీ క్రీడ కాదని వారు తెలుపుతున్నారు. మన పూర్వీకుల నుంచి వచ్చిన కళ ను ప్రభుత్వం ప్రోత్సహించాలని, జాతీయ స్థాయిలో కర్రసాము శిక్షకులు అంటున్నారు.
Also Read: Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలకు వెళుతున్నారా? ఈ 10 తప్పులు చేయకండి!
రక్షణ కోసం..
నేటి సమాజంలో జరిగే కొన్ని దారుణాలను చూసి, ఆత్మరక్షణ కోసం కర్రసాము విద్యను నేర్చుకుంటున్నట్లు యువతులు తెలుపుతున్నారు. తమను తల్లిదండ్రులు ప్రోత్సాహిస్తున్నారని, క్లిష్ట సమయంలో తమకు ఈ విద్య ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అందుకే ఈ జిల్లా యువతులు కర్ర చేతిలో పడితే, మామూలుగా ఉండదు. అందుకే మృగాలు తస్మాత్ జాగ్రత్త.. వీరి జోలికి వెళితే, అటునుండి అటే బెడ్ రెస్ట్ ఖాయం. అంతేకాదు సాధారణ యువతుల జోలికి వెళ్ళినా, చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఇలాంటి పనులు చేసి జీవితాలు బుగ్గిపాలు చేసుకోవద్దు సుమా!