Big Stories

Innovative Election Campaign: తెలంగాణలో వినూత్న ప్రచారం.. వైరల్ అవుతోన్న గాడిద గుడ్డు..

Congress MLC Balmoor Venkat Innovative Election Campaign: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధంగా ప్రజలును ఆకర్షించే పనిలో పడ్డారు. కొందరు తాము అధికారంలోకి వస్తే ఏం ఇస్తాము అనేది వినూత్నంగా చెబుతుంటే మరికొందరు ఇతర రాజకీయ పార్టీలు ఎలాంటి మోసాలు చేశాయో అనేది వినూత్నంగా చెబుతున్నారు.

- Advertisement -

అయితే తెలంగాణ ఎమ్మెల్సీ వెంటక్ బల్మూర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఏం ఇచ్చిందనే అంశంపై కొత్త తరహా ప్రచారం ప్రారంభించారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్ ,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది కోసం రాష్ట్రానికి రావాల్సినవి ఇవ్వమంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పారు. అటు మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందని.. తెలంగాణకు కనీసం ఒక ఐఐఎం, ఎన్ఐటీ విద్యాలయం ఇవ్వమంటే ఇవ్వలేదని.. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని.. బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా ఇవ్వమంటే ఇవ్వలేదని.. 811 టీఎంసీ కృష్ణ జలాలలో సరైన వాటా ఇవ్వమంటే ఇవ్వలేదని.. విభజన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వీటన్నింటికీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని తెలిపారు.

Also Read: బాంబ్ పేల్చిన కేటీఆర్.. యూటీగా హైదరాబాద్, గతంలో కూడా..

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు ఏమాత్రం సహకరించలేదని బల్మూర్ వెంకట్ అన్నారు. దీనికి కేంద్ర మంత్రి గా కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు బండి సంజయ్,ఈటెల రాజేందర్ ఇతర నాయకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు. బీజేపీ నాయకులను గెలిపిస్తే కూడా మన రాష్టానికి అభివృద్ధి జరిగేది లేదని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీని మళ్ళీ గెలిపిస్తే ఇంకా పెద్ద గాడిద గుడ్డు ఇస్తారు తప్ప అభివృద్ధి చెయ్యరని బల్మూరు వెంకట్ స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News