BigTV English

Mr Bachchan: నల్లంచు తెల్లచీర.. ఏం సాంగ్ రా బాబు.. మైండ్ నుంచి పోవడం లేదు

Mr Bachchan: నల్లంచు తెల్లచీర.. ఏం సాంగ్ రా బాబు.. మైండ్ నుంచి పోవడం లేదు

Mr Bachchan movie song update(Telugu cinema news): మాస్ మహారాజా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెల్సిందే.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో మిస్టర్ బచ్చన్ నుంచి మరో కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు. నల్లంచు తెల్లచీర అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

మొదటి నుంచి ఈ సాంగ్ బావుంటుందని ఒకపక్క హరీష్ శంకర్.. ఇంకోపక్క రవితేజ చెప్పుకుంటూ వచ్చారు. వారు చెప్పినట్టే ఈ సాంగ్ అదిరిపోయింది. భాగ్యశ్రీ అందం.. మాస్ మహారాజా ఎనర్జీ, మాస్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. భాస్కర భట్ల లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను శ్రీరామ్ చంద్ర, సమీరా భరద్వాజ్ అద్భుతంగా ఆలపించారు.


మిస్టర్ బచ్చన్ నుంచి రిలీజైన ప్రతిపాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.. ఇక అవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ సాంగ్ మరో ఎత్తు అని చెప్పాలి. థియేటర్ లో ఈ సాంగ్ కు విజిల్స్ పక్కా అని చెప్పుకోవాలి. సాంగ్స్ తోనే హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా థియేటర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

AP Women: ఏపీలో మహిళలకు శుభవార్త.. 2 లక్షల వరకు చేయూత, ఇంకెందుకు ఆలస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. జగన్ ఫ్యామిలీ మెడకు, భారతీ దగ్గర బంధువు సునీల్‌రెడ్డి?

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

TDP Vs YCP: ఏపీలో మెడికల్ పాలిటిక్స్.. PPP పద్ధతిలో కాలేజీలు.. దశ మారుతుందా?

Big Stories

×