BigTV English

NagaBabu strong warning: నాగబాబు వార్నింగ్ వెనుక.. మేం పోలీసు బిడ్డలం..!

NagaBabu strong warning: నాగబాబు వార్నింగ్ వెనుక.. మేం పోలీసు బిడ్డలం..!

NagaBabu strong warning: ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అయితే పవన్‌ను ఓడించేందుకు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ నాగబాబు ఆరోపించారు. తాజాగా అందుకు సంబంధించి డీటేల్స్‌ను బయటపెట్టారాయన. అంతేకాదు మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.


తాము పోలీసు బిడ్డలమని గుర్తుచేశారు నాగబాబు. మీరు అడ్డుగోలుగా ఫైట్ చేస్తే.. తాము నేరుగా తలపడతామన్నారు. ఇంకోసారి ఇలాంటి బెదిరింపులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఇలాంటివారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గీత అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఆ ఫోన్ కాల్ రికార్డును నాగబాబు షేర్ చేశారు.

పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయకూడదా? ముఖ్యంగా గీత పేరు ఉన్నవాళ్లు ఎవరూ పోటీ చేయకూడదా? జనసేన అభ్యర్థుల పేర్లున్న డమ్మీ వ్యక్తులతో పోటీ చేయించలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన పనులు తాము చేయలేదన్నారు. బెదిరింపులకు దిగేవారి అంతు తేలుస్తామని మరోసారి నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.


ALSO READ: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ క్విడ్ ప్రోకో!

ఓడిపోయే దశలో ఉన్నారు కాబట్టే అతి చేస్తున్నారని దుయ్యబట్టారు నాగబాబు. దావూద్ ఇబ్రహీంను తెచ్చినా తాము ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. పిఠాపురంలో ఎవరినైనా బెదిరిస్తే గుణపాఠం తప్పదన్నారు.

 

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×