Big Stories

Dharmana Prasada Rao Vs Gondu Shankar: ధర్మానతో సర్పంచ్ ఢీ

Dharmana Prasad Rao vs Gondu Shankar AP Elections 2024: దశాబ్దాలుగా శ్రీకాకుళంలో ఎన్నికలు అంటే ధర్మాన వర్సెస్ గుండ కుటుంబాలే కనపడేవి.. అయితే ఈసారి మాత్రం అక్కడ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు వర్సెస్ సర్పంచ్ మధ్య పోరు షురూ అయింది. 1985 తర్వాత మొదటిసారి గుండ కుటుంబాన్ని పక్కనపెట్టి ధర్మానను ఢీ కొట్టేందుకు సర్పంచ్‌ను బరిలోకి దింపింది టీడీపీ .. దీంతో రాజకీయ ఉద్దండుడైన ధర్మానను అయన ఏమేర ఢీ కొంటారు? జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన స్పీడ్ కు అతను బ్రేక్ వేయగలరా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజవర్గం ఏర్పడ్డాక రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తంగి సత్యనారాయణ, చరా లక్ష్మీనారాయణల తర్వాత అక్కడి రాజకీయమంతా అటు గుండ, ఇటు ధర్మాన కుటుంబాల చుట్టే తిరుగుతూ వస్తోంది. 1985 నుంచి 1999 వరకు వరుసగా నాలుగుసార్లు టీడీపీ నుంచి గెలుపొందారు గుండ అప్పల సూర్యనారాయణ. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. ఓటమి ఎరుగని నేతగా ఉన్న గుండ అప్పల సూర్యనారాయణను 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు రెండుసార్లు ఓడించారు.

- Advertisement -

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణ స్థానంలో అతని భార్య గుండ లక్ష్మీదేవి టీడీపీ తరుపున బరిలోకి దిగి.. వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019 ఎన్నికల్లో తిరిగి లక్ష్మీదేవిపై ధర్మాన ప్రసాదరావు గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. 1985 నుoచి గుండ కుటుంబం శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాలలో చక్రం తిప్పుతుంది. సొంత నియోజకవర్గం అయిన నరసన్నపేట నుంచి రెండుసార్లు కాంగ్రెస్ తరుపున గెలుపొంది 2004 లో శ్రీకాకుళం కి వలస నాయకుడుగా వచ్చి శ్రీకాకుళంలోనే స్థిరపడ్డాడు ధర్మాన ప్రసాదరావు. ఇక అప్పటి నుంచి శ్రీకాకుళంలో గుండ, ధర్మాన కుటుంబాల మద్యే ప్రధాన పోరు జరుగుతూ వస్తోంది.

అయితే 1985 తర్వాత మొదటిసారి టీడీపీ అధిష్టానం గుండ కుటుంబాన్ని పక్కన పెట్టి టిడిపి యువనేత, గార మండలం కిష్టంపేట సర్పంచ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొoడు శంకర్‌కు టికెట్ కేటాయించింది శ్రీకాకుళం పార్టీ ఇంచార్జిగా ఉన్న లక్ష్మీదేవిని కాదని శంకర్ కి టికెట్ ఇవ్వటంపై గుండ వర్గం భగ్గుమంది. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనల భాట పట్టారు గుండ వర్గీయులు  పార్టీలో కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంతో ఉన్న విభేదాలతో ఆయనే ఇదంతా చేయించడంటూ భగ్గుమంన్నారు. ఆ క్రమంలో తమ అనుచరుల అభీష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ఆలోచనకు వచ్చారు లక్మిదేవి.

Also Read: కిలివేటికి సొంత సెగ.. డోంట్ కేర్

ప్రత్యర్థి పార్టీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చిన ధర్మాన అన్ని తన గెలుపుకు అనుకూలించేలా ఉన్నాయని ముచ్చట పడ్డారు. అంతకు ముందంతా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, సీఎం కి ఇదే విషయం చెబితే ఈసారి పోటీ చేయమని కోరారని, తనకి పదవులపై మోజు లేదని. గెలిపిస్తారో ఒడిస్తారో మీ ఇష్టం అని వైరాగ్యంతో మాట్లాడుతూ వచ్చారు ధర్మాన ఈసారి తాను ఓడిపోతానని మా వాళ్ళు అంటున్నారని అసలు వైసీపీని ప్రజలు ఎందుకు ఓడిస్తారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇపుడు ధర్మాన వాయిస్ లో చెంజ్ వచ్చింది. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా గుండ కుటుంబానికి చెందిన వ్యక్తులు బరిలో లేరు కాబట్టి మనం సునాయాసంగా గెలుస్తాం. శ్రీకాకుళంలో గత నాలుగుసార్లు గెలిచిన దానికంటే సునాయసంగా తాను గెలుస్తానని, అసలు టిడిపి అభ్యర్ధి ఎవరో కూడా ఎవరికీ తెలియదని అంటున్నారు.

ఇటీవల జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోను 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను ఇంకా ప్రజల ముందుకు ఓటు కోసం వెళ్లాలా నేను వెళ్ళను. నా బదులు పార్టీ విభాగాలే పనిచేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు ధర్మాన. కానీ వాస్తవానికి ధర్మాన బయటకు చెబుతున్నంత ఈజీగా పరిస్ధితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న గుండ,ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు. వారిద్దరూ కూడా గాలికి అనుగుణంగా రాజకీయాలు చేసేవారు.

ప్రజలు కూడా ధర్మాన ప్రసాదరావు మీద విరక్తి ఉంటే గుండ కుటుంబాన్ని గెలిపిస్తారు. గుండ కుటుంబం మీద కోపమొస్తే ధర్మాన ప్రసాదరావును అందలమెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ ఒకరి మీద ఒకరు వైరం పెంచుకోరు, విమర్శిoచుకోరు. కానీ మొదటిసారి ధర్మానను టీడీపీ కొత్త అభ్యర్థిని ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాని పరిస్థితి ఎదురైందంట గుండ కుటుంబం చేతిలో ఓడినా,గెలిచినా ఒక లెక్కని అదే కొత్త వ్యక్తి అయిన గుండ శoకర్ చేతిలో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని ధర్మాన భావిస్తున్నారంట.

Also Read:  ఎన్నికల సినిమా..! టాలీవుడ్ చీలిందా?

మరోవైపు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడు ఈ సారి తన సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ గెలస్తామంటున్నారు. టీడీపీ అధినేత వ్యూహాత్మకంగా పావులు కదిపి జిల్లా రాజకీయాల్లో కీలకమైన కలమట కుటుంబానికి చెందిన కలమట వెంకటరమణమూర్తిని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు.. కాపు వర్గానికి చెందిన వెంకటరమణ అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీకి పెద్ద ప్లస్ అవుతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

ధర్మాన తనకన్నా చాలా జూనియర్ అయిన ప్రత్యర్థిని విమర్శించడానికి ఆలోచిస్తున్నారంట… పైగా మాజీ ఎమ్మల్యే గుండ లక్ష్మీదేవి టిడిపి రెబల్ గా బరిలోకి దిగి ప్రత్యర్ధి ఓటు బ్యాంకుని చీల్చుతారని ధర్మాన భావించారు.కానీ ఈ నెల 15న పలాస పర్యటనలో చంద్రబాబును కలిసి టికెట్ విషయమై చర్చించిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు గుండ దంపతులు ప్రకటించటం ధర్మానకు మింగుడు పడటం లేదంట. ఆ క్రమంలో ఇంత అనుభవం ఉన్న తాను ఇంకా ప్రచారానికి వెళ్లాలా అంటూ డాంబికాలు పలికిన ధర్మాన ఇపుడు తానే గుండ అనుచరుల ఇళ్లకు వెళ్లి తమ వైపుకు రావాలని కోరుతున్నారు. ఓ వైపు వీధులలో ప్రచారాలతో పాటు, కుల సంఘలతోనూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

టీడీపీ శంకర్ చాప కింద నీరులా ఇకనియోజకవర్గంలో అల్లుకుపోతున్నారు. గత రెండున్నరేళ్లగా టీడీపి టికెట్ ఆశావహుడుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చాలా వరకు పట్టు సంపాదించారు.. పైగా గుండ లక్ష్మీదేవి అనుచరులతోను సత్సంబంధాలు కొనసాగించడంలో సఫలీకృతులయ్యారు.  దానికి తోడు కలమట వెంకటరమణ ఆయనకు తోడవ్వడంతో ధర్మాన వరం హైరానా పడుతోంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన ఓట్ బ్యాంక్ పట్టణ ఓటర్లే. దాంతో వారి నాడిని బట్టే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడతాయి. మరి ఈ సారి వారు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News