BigTV English

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Nandamuri Mohan Roopa donated Rs. 25 lakhs to help the flood victims: ఏపీ వరదల బాధితులను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. తాజాగా నందమూరి మోహనకృష్ణ , నందమూరి మోహన్ రూప రూ. 25 లక్షల విరాళం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్ ను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. దీంతో వారిని సీఎం చంద్రబాబు అభినందించారు. వరద బాధితులకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు.


Also Read: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

ఇదిలా ఉంటే.. ఏపీలో ఇటీవలే భారీగా వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీగా నష్టం వాటిలల్లింది. వరద బాధితులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు విరాళం అందజేసి వారికి అండగా నిలబడ్డారు. నందమూరి మోహన్ కృష్ణ.. ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్. అంతేకాక నందమూరి తారక రామారావు గారు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ నటించిన శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా తమిళ్ లో శివాని గణేషన్, ప్రభు నటించిన చరిత్ర నాయగన్, హిందీలో ఫరూక్ షేక్ నటించిన గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.


గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ, మోహన్ రూప ఇదేవిధంగా ఎంతోమందికి సహాయం చేశారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు కూడా వీరు విరాళాలు ఇచ్చారు. నందమూరి మోహన్ రూప గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున చురుకుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Also Read: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×