BigTV English

Bigg Boss 8 Telugu Promo: హౌస్‌లో అమ్మాయిలపై నాగ్ సీరియస్, ప్రేరణ ఎమోషనల్.. కన్ఫెషన్ రూమ్‌లో ఏం జరిగింది?

Bigg Boss 8 Telugu Promo: హౌస్‌లో అమ్మాయిలపై నాగ్ సీరియస్, ప్రేరణ ఎమోషనల్.. కన్ఫెషన్ రూమ్‌లో ఏం జరిగింది?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మూడోవారం పూర్తయ్యేసరికి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, మనస్పర్థలు మరింత పెరిగిపోయాయి. అంతే కాకుండా ఈవారం జరిగిన రేషన్ టాస్కులతో పాటు ఎగ్స్ టాస్క్ కూడా కంటెస్టెంట్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. అప్పటివరకు అందరూ కలిసి సరదాగా ఉన్నా.. ఎగ్స్ టాస్క్ నుండి కంటెస్టెంట్స్ అంతా విచక్షణ లేకుండా కొట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఈవారం కంటెస్టెంట్స్‌పై నాగార్జున సీరియస్ అవ్వక తప్పలేదు. అలా ఎవరు చేసినా తప్పులను వారికి చెప్తూ.. వారు కోపంలో అన్న మాటలనే వారికి గుర్తుచేశారు. ఆ క్రమంలో మణికంఠ.. నాగార్జునపై రివర్స్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


ప్రేరణ ఎమోషనల్

ముందుగా తన టీమ్‌లో అందరికంటే ఎవరు బాగా ఆడారు అంటూ నిఖిల్‌ను నాగార్జున అడగడంతో ప్రోమో మొదలవుతుంది. నాగార్జున అడిగిన ప్రశ్నకు సీత అని సమాధానమిచ్చాడు నిఖిల్. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు వెళ్లింది అని గుర్తుచేశారు నాగ్. ఆ తర్వాత ప్రేరణ లేపి తన ఆట గురించి అడగగా.. ‘‘డీసెంట్‌గా ఆడాను కానీ బెస్ట్‌గా ఆడలేదు’’ అని చెప్పింది. ఏ విషయంలో డీసెంట్ కాదు అని నాగార్జున ప్రశ్నించగా.. ‘‘క్యారెక్టర్‌లెస్ అనే మాట వాడాను’’ అంటూ ఎమోషనల్ అయ్యాంది ప్రేరణ. ‘‘పంపులు, కొలాయిల దగ్గర కొట్టుకుంటారు కదా.. అలా మాట్లాడుతున్నారు. ఏమైపోతుంది మీ సంస్కారం’’ అంటూ బిగ్ బాస్ హౌస్‌లో అమ్మాయిలపై సీరియస్ అయ్యారు నాగార్జున.


Also Read: ఆర్జీవీ పార్టీలో తాగిపడిపోయిన ‘బిగ్ బాస్’ సోనియా.. ఆ రోజు ఏం జరిగింది?

పుణ్యస్త్రీ, పతివ్రత

‘‘పుణ్యస్త్రీ టైమ్‌లో చెప్పాను.. ఇప్పుడు పతివ్రత వరకు వచ్చావు’’ అంటూ విష్ణుప్రియాతో సీరియస్‌గా మాట్లాడారు నాగార్జున. ‘‘మీ ఇద్దరి మధ్య డైలీ సీరియల్‌లాగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది’’ అని చెప్పి ప్రేరణ, విష్ణుప్రియా మధ్య జరిగిన దోశ గొడవ ఫుటేజ్‌ను మరోసారి చూపించారు నాగార్జున. దాని గురించి మణికంఠను వివరణ అడిగారు. ‘‘దానికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత దోశ వేసే విధానం’’ అంటూ మణి మాట్లాడుతుండగానే నాగ్ జోక్యం చేసుకొని ‘‘వేసిన పద్ధతిలో తప్పు ఇంటెన్షన్ ఉందా’’ అని అడిగారు. దానికి మణి ఏం మాట్లాడలేదు. ‘‘ఒక మామూలు సంఘటనలో మణి జోక్యం చేసుకొని పెద్దగా చేశాడని మాకు అనిపిస్తుంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు నాగ్.

ఏంటా వీడియో?

నాగార్జున అభిప్రాయానికి ఎదురుమాట్లాడాడు మణికంఠ. ‘‘ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది’’ అని చెప్తుండగానే.. ‘‘తప్పు చేస్తున్నావు మణి. నీ తప్పు నువ్వు గ్రహించడం లేదు’’ అంటూ తనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు నాగార్జున. ఆ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మణికంఠకు ఏదో వీడియో చూపించారు. అది ఏం వీడియో అని ప్రోమోలో రివీల్ చేయలేదు మేకర్స్. దీంతో అసలు కన్ఫెషన్ రూమ్‌లో ఏం జరిగింది అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. మొత్తానికి ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి అభయ్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. బిగ్ బాస్ రూల్స్‌ గురించి తను హేళన చేయడం ప్రేక్షకులకు కూడా నచ్చలేదు.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×