BigTV English

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

YS Sharmila Serious on Jagan over Tirupati Laddu: తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ విషయమై తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది. దీనిపై కేంద్రం కూడా స్పందించి, వెంటనే అధికారులు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అన్ని పార్టీల నేతలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.


Also Read: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

ఈ విషయమై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల శనివారం గవ్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె గవర్నర్ ను కోరారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై ఆమె సీరియస్ అయ్యారు. జగన్, వైసీపీ నేతలు దీనిపై ఏ విధంగా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా..? ఆ లడ్డూకు సంబంధించి కాంట్రాక్టులను మీరే ఓకే చేశారు కదా..? అలాంటప్పుడు మీరెలా ఎంక్వైరీ చేయాలని అడుగుతారంటూ షర్మిల క్వశ్చన్ చేశారు. తమ వినతి పత్రాన్ని స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు.

Also Read: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×