E-Paper
Advertisement

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు

Nandyal: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు
Advertisement

Nandyal: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ ఇటీవల ఆచరణీయమైన దాతృత్వం ప్రదర్శించారు. పిల్లలు లేని వీరు తమ జీవితకాలం సంపాదించిన ఆస్తిలో దాదాపు రూ.2 కోట్ల విలువ గల ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా అందించారు.

వీరు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవారు. పల్లె జీవితంలో మంచి గుణాలను పాటిస్తూ జీవించారు. తమ ఆస్తిని గుడికి ఇవ్వాలని నిర్ణయించిన విషయం పూర్తిగా స్వచ్ఛందమని వీరు స్పష్టంగా ప్రకటించారు. వారి విరాళం కింద ఆస్తి ఆలయానికి అధికారకంగా చేర్చే విధంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. వీరు ఆస్తిని వారి ఇష్టానుసార, ఎటువంటి బలవంతం లేకుంగా గుడికి అందించారు.

Advertisement

ఈ విరాళం వలన మాధవరం రాములవారి గుడి అభివృద్ధికి, ఆలయ కార్యకలాపాలకు , భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ స్వచ్ఛమైన మనస్సును, భక్తిని ఈ విరాళం ద్యారా చూపించారని గ్రామ ప్రజలు ప్రశంసించారు.

ALSO READ:‘నా క్యారెక్టర్‌పై నిందలు వేశారు.. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు’ – భర్త ఇంటి ముందు భార్య పోరాటం!

Advertisement

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×