BigTV English

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు.. వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : టీడీపీ కార్యకర్తలకు నోటీసులు..  వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి ఆగ్రహం..

Nara Bhuvaneshwari : వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమంలో తప్పేముంది ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని నారా భువనేశ్వరి నిలదీశారు. పార్టీ కార్యకర్తలు తనకు బిడ్డల్లాంటి వాళ్లని పేర్కొన్నారు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? ప్రశ్నించారు. తనను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని గట్టిగా ప్రశ్నిస్తూ నారా భువనేశ్వరి ట్వీట్‌ చేశారు.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది.


ఇంకోవైపు సుప్రీంకోర్టులో స్కిల్‌ డెవలప్ మెంట్ స్కామ్‌ కేసు విచారణ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించనుంది. స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మరోవైపు స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టుల్లో చంద్రబాబు కేసులకు సంబంధించి వాదనలు ఉండటంతో.. ఆయన తరపు సీనియర్‌ న్యాయవాదులు బిజీగా ఉన్నారని కోర్టుకు జూనియర్ లాయర్లు తెలిపారు. దీంతో ఏపీ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ జరుపుతామని వాయిదా వేసింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×