4 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతం అయిందని అన్నారు మంత్రి నారా లోకేష్. రాబోయే ఐదేల్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (GIC) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా మన రాష్ట్రంలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్ కాగా, జగన్ కు మాత్రం బ్యాడ్ న్యూస్ అని అన్నారు.
ఘన స్వాగతం..
1995 నుంచి సింగపూర్ తో సీఎం చంద్రబాబుకి అనుబంధం ఉందని, అయితే ఈసారి ఆయన పర్యటన సందర్భంగా ఊహించని రీతిలో జనం వచ్చారని, 2వేలమంది తెలుగువారు తమ వద్దకు వచ్చారని చెప్పారు లోకేష్. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగ రత్నం, మంత్రి టాన్ సీలింగ్ తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలందరితో చర్చలు జరిపామని కేవలం 4 రోజుల్లో 26మందితో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు. తాను 19 మంది పారిశ్రామికవేత్తలతో చర్చించానని, మొత్తం 35 కార్యక్రమాలకు హాజరయ్యానని చెప్పారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని సింగపూర్ ప్రభుత్వం గౌరవిస్తూ వస్తోందన్నారు.
TCS ని విశాఖకి తీసుకుని వస్తే, ఎందుకు ఏడుపు @ysjagan ?
TCS రాకుండా, ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు రాకుండా ఉండటానికి, ఎందుకు కోర్టులో కేసులు వేశావ్ ?#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/m6PgweKxHH
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2025
వైసీపీ అరాచకం..
2019లో ఏపీలో ప్రభుత్వం మారాక సింగపూర్ తో చేసుకున్న ఒప్పందాలను జగన్ టీమ్ రద్దు చేసుకుందన్నారు లోకేష్. దీనికోసం వారు ఏకంగా సింగపూర్ దేశంపైనే అవినీతి ముద్ర వేసేందుకు ప్రయత్నించారన్నారు. వారితో మాట్లాడకుండానే ఏకపక్షంగా ఒప్పందాలు రద్దుచేసి సింగపూర్ కంపెనీలను తరిమేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతలో టాప్ – 5లో సింగపూర్ ఉంటుందని, అలాంటి దేశంపై నిందలు వేసి రాష్ట్రానికి నష్టం చేకూర్చారని అన్నారు లోకేష్. గతేడాది తమ ప్రభుత్వం వచ్చాక కూటా జగన్ కుట్రలు కంటిన్యూ చేశారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన కంపెనీల్లోని ఉద్యోగులతో సింగపూర్ ప్రభుత్వానికి జగన్ మెయిల్స్ పంపించారన్నారు. ఏపీలో అస్థిరమైన ప్రభుత్వం ఉందని, పెట్టుబడులు పెట్టొద్దని ఈ – మెయిల్స్ పంపించి కంపెనీలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని జగన్ ప్రయత్నించారన్నారు. ఆఖరికి టీసీఎస్ కు 99 పైసలకే భూములిస్తే కోర్టులో కేసులు వేసి జగన్ నవ్వులపాలయ్యారని అన్నారు లోకేష్. వైసీపీ హయాంలో అమర్ రాజా కంపెనీని పక్క రాష్ట్రానికి తరిమేశారని, లులు గ్రూప్ తో కూడా ఒప్పందం రద్దు చేసుకున్నారని చెప్పారు. ఏపీ బ్రాండ్ ని జగన్ నాశనం చేశారు కాబట్టే ప్రజలు కూటమిని ఎన్నుకున్నారని అన్నారు లోకేష్. ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి నినాదం అన్నారాయన.
సింగపూర్ పర్యటనపై జగన్ కుట్రలు చూసి ఆశ్చర్యపోయిన ఏపీ ప్రభుత్వ బృందం..
ఏపీతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు అంటూ, సింగపూర్ ప్రభుత్వానికి జగన్ ఎలాంటి ఈమెయిల్స్ రాయించాడో, ప్రజల ముందు పెట్టిన నారా లోకేష్#PsychoFekuJagan#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/dkTr7HDjq0
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2025
బ్రాండ్ బాబు..
తెలంగాణాకు హైదరాబాద్, కర్నాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నయ్ ఉంటే ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందన్నారు లోకేష్. పట్టుదలతో పరిశ్రమలు రప్పిస్తున్నామని చెప్పారు. CBN 4.0 అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వివరించారు. NMDC రా మెటీరియల్ ప్రాజెక్ట్ కి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని, భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు రాబోతోందని, టాటా పవర్, TCS ఆల్రడీ రాష్ట్రానికి వచ్చాయని, కాగ్నిజెంట్ ని కూడా తెచ్చామని.. రాబోయే నాలుగేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు లోకేష్. హాస్పిటాలిటీ, రిటైల్ రంగంలో మాగ్జిమమ్ జాబ్స్ వస్తాయని, రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో 50వేల హోటల్ రూమ్ లు రావాలని చంద్రబాబు ఆదేశించారని, విశాఖ, తిరుపతి, కర్నూలు, అమరావతి, కాకినాడ, రాజమండ్రిలో పెద్దఎత్తున హోటల్స్ రాబోతున్నాయని, తద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.
విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి సీఎం కావడం వల్ల 2019 -2024 మధ్య రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు లోకేష్. 2024లో ప్రజలు తిరిగి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. సింగపూర్ టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయామని, 2040నాటికి అక్కడ అన్ని పోర్ట్ లు మూసేసి, కేవలం ఒకే ఒక పోర్ట్ ని ఉపయోగించాలనుకుంటున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు లోకేష్.
పెద్దిరెడ్డిపై మాకు కక్ష ఎందుకు?
పెద్దిరెడ్డిపై కక్షగట్టి ఆయన తనయుడు మిథున్ రెడ్డిని జైలుకు పంపారంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు లోకేష్. పెద్దిరెడ్డిపై కక్ష ఉంటే 2014-19 మధ్య ఆయన బయట తిరిగేవారా అని ప్రశ్నిచారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ అనే కంపెనీకి, లిక్కర్ కంపెనీల నుంచి ముడుపు వెళ్లినట్టు పక్కా ఆధారాలున్నాయని, వాటికి జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. లిక్కర్ కుంభకోణంలో ఎంత డబ్బు చేతులు మారిందో జగన్ కి బాగా తెలుసన్నారు లోకేష్. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతల ఆరోపణలను తిప్పుకొట్టారు లోకేష్. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని, అలాగే మిగులు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నిర్మిస్తున్న బనకచర్లపై రాద్ధాంతం తగదని అన్నారాయన. తాము ఎవరి నీళ్లను దోచుకోవడం లేదని, గోదావరి దేవుడిచ్చిన వరం అని చెప్పారు.
క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి బెస్ట్ ఉదాహరణ, జగన్ చేసిన లిక్కర్ స్కాం.
పెద్దిరెడ్డి కంపెనీకి ఆదాన్ కంపెనీ నుంచి డబ్బులొచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే కాదు అని పెద్దిరెడ్డి ఖండించాలి.#LiquorScamByJagan#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/K205pseJcm
— Telugu Desam Party (@JaiTDP) July 31, 2025