Shubman Gill RUN OUT: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ ఓవల్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ లో తొందరగానే ఔట్ అయ్యాడు. 14 పరుగులు చేసిన రాహుల్ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్, సాయి సుదర్శన్ పర్వాలేదనిపించిన తరుణంలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ రన్ కావడం విశేషం. కీలక సమయంలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇలా చేయడం ఏంటి..? అని అందరూ ఆశ్యర్యపోతున్నారు.
Also Read : Shreyas Iyer : హీరో రేంజ్ లో దిగిన సర్పంచ్ సాబ్ .. ఏకంగా హెలికాప్టర్ తోనే
అనవసరంగా గిల్ రనౌట్
ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కాస్త తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 83 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. వర్షం కారణంగా రెండో సెషన్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కాగా.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (21) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అట్కిన్సన్ వేసిన 27.2 ఓవర్ ను ఎదుర్కొన్న గిల్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ బౌలర్ బంతిని అందుకొని స్ట్రైకర్స్ ఎండ్ లో రనౌట్ చేశాడు. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వాస్తవానికి ఈ మ్యాచ్ గెలిస్తే.. టీమిండియా 2-2 సమం చేస్తుందని అంతా భావించారు. కానీ టీమిండియా ప్రస్తుత పరిస్థితి చూస్తే గెలిచేలా కనిపించడం లేదు. కానీ కెప్టెన్ శుబ్ మన్ గిల్ రనౌట్ అయినప్పటికీ.. ఓ రికార్డును మాత్రం బ్రేక్ చేశాడు. ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. సునీల్ గావస్కర్ 1978/79లో వెస్టీండిస్ పై 732 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆ రికార్డు ఉండగా.. తాజాగా శుబ్ మన్ గిల్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
గవాస్కర్ రికార్డు బ్రేక్ చేసిన గిల్
గిల్ 737 పరుగులు చేసి సునీల్ గావస్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. టీమిండియా ఆటగాడు శుబ్ మన్ గిల్ 737 పరుగులతో మొదటిస్తానంలో, వెస్టిండీస్ సునీల్ గవాస్కర్ 732, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పై 655, విరాట్ కోహ్లీ శ్రీలంక పై 610, విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పై 593 పరుగులు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్ ఇంగ్లాండ్ కి ఓ ఫ్రీ గిప్ట్ ఇచ్చింది. శుబ్ మన్ గిల్ లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరం వికెట్ సమర్పించుకున్నాడు. అప్పటికే కస్టాల్లో ఉన్న టీమిండియాను గిల్ రనౌట్ కాస్త ఇరకాటంలో పడేసింది. ఈ ఇన్నింగ్స్ లో గిల్ మంచి టచ్ లో ఉన్నట్టు కనిపించాడు. ఆడిన 35 బంతుల్లో 4 బౌండరీలు బాదాడు. సిరీస్ లో తొలి మ్యాచ్ నుంచి మంచి ఫామ్ లో ఉన్న గిల్ చీప్ గా రనౌట్ కావడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs
— Johns. (@CricCrazyJohns) July 31, 2025