OTT Movie : ‘జంబలకిడి పంబ’ ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు కావస్తున్నా, ఎక్కడో ఒక చోట ఈ పేరు వినబడుతూనే ఉంటుంది. ఆడవాళ్ళ రాజ్యం వస్తే ఎలా ఉంటుందో ఇందులో కామెడీగా చూపించారు. ఇందులో సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుని కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కంటెంట్ తో ఒక హాలీవుడ్ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కింది. ఇందులో మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో బానిసలుగా బతుకుతుంటారు. ఈ కంటెంట్ ను మీరుకూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ సైన్స్-ఫిక్షన్ సినిమా పేరు ‘సుమురు’ (Sumuru). దీనికి డారెల్ రూడ్ట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అలెక్సాండ్రా కాంప్, మైఖేల్ షాంక్స్, సిమోనా విలియమ్స్, టెరెన్స్ బ్రిడ్జెట్ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సాక్స్ రోమర్ రాసిన కల్ట్ నవలల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా భవిష్యత్ లో మహిళల ఆధిపత్యం, పురుషుల అణచివేత చుట్టూ తిరిగే ఒక ఫాంటసీ-అడ్వెంచర్ కథను అందిస్తుంది. ఈ సినిమా Amazon Prime Video, Plexలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
భవిష్యత్‌లో భూమి నుండి చాలా దూరంలో ఉన్న అంటారెస్ అనే ఒక గ్రహంలో ఈ కథ జరుగుతుంది. ఈ గ్రహం 900 సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ మహిళలు పూర్తి ఆధిపత్యం కలిగి ఉంటారు. పురుషులు కేవలం సంతానోత్పత్తికి, బానిసలుగా పనిచేయడానికి మాత్రమే ఉంటారు. ఈ కాలనీని సుమురు అనే రాణి పాలిస్తుంటుంది. ఆమె ఒక తెలివైన నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ ఆమెకు వ్యతిరేకంగా టాక్సన్ (సిమోనా విలియమ్స్) అనే హై ప్రీస్టెస్ ఉంటుంది. ఆమె ఒక పెద్ద పామును దేవతగా ఆరాధిస్తూ, మతపరమైన భయాలను ఉపయోగించి ప్రజలను తన నియంత్రణలో ఉంచుకుంటుంది.
ఈ గ్రహంపై ఒక రోజు ఆడమ్ , జేక్ అనే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తమ స్పేస్‌షిప్ క్రాష్ అవ్వడంతో అక్కడికి చేరుకుంటారు. వీరు ఒక రహస్య మిషన్‌తో వస్తారు. భూమి ఒక వైరస్ బారిన పడటం వలన, మహిళలు సంతానం కనలేని స్థితికి వస్తారు. అందుకే ఆడమ్, జేక్ అంటారెస్‌లోని మానవులను కనిపెట్టి, వారిని ఒక కొత్త గ్రహానికి తరలించాలనే లక్ష్యంతో ఉంటారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఈ మహిళల ఆధిపత్య గ్రహంలో చిక్కుకుంటారు. ఇక్కడ పురుషుల పట్ల తీవ్రమైన పక్షపాతం ఉంటుంది. ఆడమ్, జేక్ ఈ గ్రహంలోని సమస్యలను అధిగమించాల్సి వస్తుంది. అయితే ఈ గ్రహం కోర్ ప్రమాదంగా ఉంటుంది. దీనివల్ల ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి.
Read Also : కుర్రాడితో ఆంటీ ఆటలు… రమ్యకృష్ణ ఇలాంటి సినిమా ఎలా చేసింది మావా
టాక్సన్ ఆమె అనుచరులు ఈ భూకంపాలను, ఒక దేవత పాము కోపంగా చూపిస్తూ, మతపరమైన భయాన్ని రెచ్చగొడతారు. సుమురు ఈ మత విశ్వాసాలను నమ్మనప్పటికీ, తన ప్రజలను శాంతింపజేయడానికి ఈ ఆచారాలను అనుమతిస్తుంది. కథలో టాక్సన్, ఆమె అనుచరులు పాము దేవతను ఆరాధిస్తూ, ఆడమ్, జేక్‌ను బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. అయితే సుమురు తెలివైన నాయకత్వం, ఆడమ్, జేక్ పోరాట నైపుణ్యాలతో టాక్సన్ ను ఓడిస్తారు. ఈ క్రమంలో గనులలో బానిసలుగా ఉన్న పురుషులను విముక్తి చేస్తారు. చివరగా అంటారెస్ గ్రహం దాని కోర్ వల్ల పేలిపోయే ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. సుమురు, ఆమె అనుచరులు ఆడమ్, జేక్ తో కలిసి ఒక కొత్త గ్రహం వైపు జీవన ప్రయాణం మొదలుపెడతారు.