Digital Addiction: పిల్లల నుంచి పెద్దల వరకు.. ఫోన్ ఇప్పుడు అవసరం కాదు.. అలవాటుగా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో 52 ఏళ్ల మహిళ రీల్స్ చూస్తుండగా పదేపదే నెట్‌వర్క్ పోవడంతో తీవ్ర అసహనానికి గురై.. ఆ తర్వాత విషం తీసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు డిజిటల్ అడిక్షన్‌పై మరోసారి చర్చకు తెరలేపింది. అయితే నెట్‌వర్క్ అంతరాయమే ఆత్మహత్యకు కారణమా లేదంటే మరేదైనా ఉందా అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ ఫోన్ వాడకం అవసరాన్ని దాటి.. అది లేకపోతే లైఫ్ కుదరదు అన్నట్లుగా మారిపోయాయ్. కేంద్ర ఆర్థిక సర్వే కూడా పిల్లల్లో డిజిటల్ అడిక్షన్.. చదువు, నిద్ర, ఏకాగ్రత, సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతోందని వార్నింగ్ ఇచ్చింది. మరి పిల్ల ఏడిస్తే ఫోన్ ఇచ్చేయడం.. భోజనం పెట్టేందుకు రీల్స్ చూపించడం.. ఇలాంటి పేరెంటింగ్ వద్దంటున్నారు. సెల్ ఫోన్ అవసరం.. కానీ ఫోన్‌కి బానిస కావడం మాత్రం ప్రమాదమే.