Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్ నడుస్తారు. పాదయాత్రపై టీడీపీ నేతలకు లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఏడాదిపాటు ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్ర సాగించనున్నారు. వివిధ ప్రాంతాల్లో సభల్లోనూ ప్రసంగించే అవకాశముంది. లోకేశ్ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయనే ప్రకటించడంతో తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.