BigTV English

NaraLokesh meets Satya Nadella: మైక్రో‌సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి లోకేష్ భేటీ, పెట్టుబడుల గురించి..

NaraLokesh meets Satya Nadella: మైక్రో‌సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి లోకేష్ భేటీ, పెట్టుబడుల గురించి..

NaraLokesh meets Satya Nadella: అమెరికా టూర్‌లో మంత్రి నారా లోకేష్ బిజిబిజీగా ఉన్నారు. టూర్ ముగిసే లోపు భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడులను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నాయి. లేటెస్ట్‌గా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు.


అమెరికా టూర్‌లో నాలుగోరోజు బిజీ అయ్యారు మంత్రి నారా లోకేష్. అక్కడి కాలమాన ప్రకారం.. సోమవారం రాత్రి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి లోకేష్ సమావేశ మయ్యారు. ఇరువురు దాదాపు గంటకు పైగానే వివిధ అంశాలపై చర్చించారు.

కొత్తగా ఏర్పడిన ఏపీకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మంత్రి లోకేష్ ఆయనను కోరారు. ఐటీ, ఏఐ, నైపుణ్యాభివృద్ధి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు మంత్రి. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన పాలసీల గురించి వివరించారు.


క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు వస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందడమే కాదు, అక్కడి యువతకు ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అగ్రికల్చర్‌కు ఏఐకు అనుసంధానంతో సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. సీఎం చంద్రబాబు ఆలోచనతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చినట్టు తెలిపారు.

డిజిటల్ గవర్నెన్స్, లాజిస్టిక్‌లకు ఏపీ అనువుగా ఉంటుందన్నారు. తాము అనుసరించే విధానాలకు మైక్రోసాఫ్ట్ సహకారం కోరుతున్నామని, రాజధాని అమరావతిని ఏఐ కేపిటల్‌గా తయారు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు చెపారు మంత్రి లోకేష్. ఆవిష్కరణల కోసం ఏపీతో కలిసి పని చేయాలని సత్యనాదెళ్లను మంత్రి కోరారు.

ఏపీలో అభివృద్ధి చేయబోయే వివిధ సంస్థల గురించి వివరించారు మంత్రి లోకేష్. స్వతహాగా సత్య నాదెళ్ల ఉమ్మడి ఏపీకి చెందిన వ్యక్తి కావడంతో లోకేష్ చెప్పినదంతా విన్నారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చింది. ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ కంపెనీ రావడానికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

ALSO READ:  తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. పెరిగిన శ్రీవారి ఆదాయం.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

అంతకుముందు టెస్లా సీఎఫ్ఓ భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఏపీ వనరుల గురించి ఆయనకు వివరించారు. ముఖ్యంగా అనంతపురం ప్రాంతం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అక్కడే ఏర్పాటైన కియో కార్ల పరిశ్రమ గురించి వివరించారు. ప్రపంచంలో  టాప్-100 కంపెనీల సీఈఓలతో మంత్రి లోకేష్ భేటీ మంచి ఫలితాలు ఇస్తుందని టీడీపీ ఎన్నారై విభాగం చెబుతోంది.

 

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×