E-Paper
Advertisement

Raghuramakrishna Raju: టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?

Raghuramakrishna Raju: టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?
Advertisement
Raghuramakrishna Raju Joins TDP
Raghuramakrishna Raju Joins TDP

Raghuramakrishna Raju Joins TDP (AP political News): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే ప్రజలముందుకొచ్చాని తెలిపారు. టీడీపీ అధినేత, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని పాలకొల్లు సభలో అన్నారు.

Advertisement

రఘురామకృష్ణ రాజు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలు నచ్చక వైసీపీలోనే ఉంటూ రెబెల్‌గా మారారు. కొద్దిరోజుల క్రితం ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే వార్త చక్కర్లు కొట్టింది. కూటమిలో భాగంగా నరసాపురం ఎంపీ సీటు బీజేపీకే వచ్చింది. కానీ రఘురామకృష్ణ రాజును కాదని ఆ టికెట్ భూపతి శ్రీనివాసవర్మకు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో ఏ సీటు టికెట్ సంపాదిస్తారో వేచి చూడాల్సిందే.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×