BigTV English

Survey On AP Elections: ఏపీలో మళ్లీ సర్వేల హీట్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

Survey On AP Elections: ఏపీలో మళ్లీ సర్వేల హీట్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?

Survey Report: ఏపీలో మళ్లీ సర్వేల వ్యవహారం హీటెక్కుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా సర్వేలేంటని అనుకుంటున్నారా.. అయినా చేశాయి పొలిటికల్ పార్టీలు. ఓవైపు అధికార కూటమి ఇంకోవైపు ప్రతిపక్షం వైసీపీ సర్వేలు చేశాయి. ఏపీలో కూటమి ఏడాది పాలనపై జనం నుంచి రియాక్షన్స్ అడిగి తెలుసుకుంటున్నారు. సర్వే రిజల్ట్ ప్రకారం నెక్ట్స్ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వెన్నుపోటు దినం జరిపిన తర్వాతే ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది వైసీపీ.


సర్వేకు తగ్గట్లుగా భవిష్యత్ కార్యచరణపై వైసీపీ అడుగులు వేసే యోచనలో ఉంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది.. మొదటి క్వశ్చన్ వేస్తున్నారు. బాగుంది అంటే అక్కడితో మ్యాటర్ ఓకే. ఒకవేళ బాగోలేదని ఎవరైనా అంటే మరో పది నిమిషాల తర్వాత మరొక ఐవిఆర్ కాల్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారని అడిగారు. జనసేన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచి సర్వే ప్రారంభించినట్లు తెలిసింది.

ఇక కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఏపీ ప్రజలకు ఫోన్లు వెళ్లాయి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా.. కూటమిలోని పార్టీలతో మీ ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఎలా ఉన్నాయి.. లిక్కర్.. మైనింగ్.. ఇసుకలో మీ ఎమ్మెల్యే పాత్ర ఉందా, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మీ ఎమ్మెల్యే కి ఎన్ని మార్కులు ఇస్తారు. ఇలాంటి క్వశ్చన్లను అడిగించారు. దీని ఫలితాలు త్వరలోనే రానున్నాయి. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వైసీపీకి మళ్లీ గెలిచే అవకాశాలు లేనట్లు సర్వేలో తేలిందట.


రెండు కూటముల సర్వేల్లో కీలకమైన రిజల్ట్స్ వచ్చాయంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల సర్వే హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలు రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నాయా అన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. విశాఖ ఎకానమిక్ రీజియన్‌ను రాష్ట్ర గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలన్నారు సీఎం చంద్రబాబు. 8 జిల్లాలతో కలిపి విశాఖ ఎకానమిక్‌ రీజినయ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, మన్యం.. మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని ఆదేశించారు సీఎం. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు.

Also Read: మా నాన్నకు క్యాన్సర్.. వైద్యం అందించకుండా!! ముద్రగడ కూతురు సంచలనం

6 పోర్టులు, 7 మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్‌తో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలికవసతుల కల్పన.. ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×