BigTV English

Manchu Vishnu: శ్రీ విష్ణుకి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన విష్ణు.. ఈసారి దబిడి దిబిడే!

Manchu Vishnu: శ్రీ విష్ణుకి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన విష్ణు.. ఈసారి దబిడి దిబిడే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న శ్రీ విష్ణు (Sri Vishnu) తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీతో పాటు యువతను ఆకట్టుకునేలా సినిమాలు చేస్తూ.. మంచి క్రేజ్ అందుకున్న ఈయన.. తన కామెడీతో ఆడియన్స్ ను అలరిస్తున్నారు. అందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయనగా.. చివరిగా ఓం భీమ్ బుష్, శ్వాగ్ వంటి చిత్రాలతో అలరించిన శ్రీ విష్ణు.. ఇప్పుడు సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


సింగిల్ ట్రైలర్లో కన్నప్ప పై ట్రోల్స్ ..

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసినప్పుడు.. అందులో కొన్ని సినిమాలలోని ఫన్నీ మూమెంట్స్ ను కట్ చేసి ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ (Balakrishna), మంచు విష్ణు(Manchu Vishnu) లాంటి స్టార్స్ సినిమాలలోని డైలాగులు ఉన్నాయి. పైగా మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీ గా తీస్తున్న ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివయ్యా’ అనే డైలాగును చాలా వ్యంగ్యంగా చూపించారు. దీంతో మంచు విష్ణు.. శ్రీ విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


క్షమాపణలు చెప్పిన శ్రీ విష్ణు..

దీంతో శ్రీ విష్ణు స్పందించి క్షమాపణలు కూడా చెప్పారు. అంతేకాదు కన్నప్ప టీంకి క్షమాపణ కోరుతూ.. శ్రీ విష్ణు వీడియో కూడా విడుదల చేశారు. “ఎవరిని ఉద్దేశించి డైలాగ్స్ వాడలేదని, ఏదేమైనా కన్నప్పలోని శివయ్య డైలాగ్ రిఫరెన్స్ తీసుకున్నందుకు ఆ టీం బాగా హర్ట్ అయింది అని తెలుస్తోంది. అందుకు క్షమించగలరు అని కోరుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ సింగిల్ సినిమా ట్రైలర్లో యానిమల్ చిత్రంలోని రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే సీన్.. బాలయ్య, హనీ రోజ్ తో మాట్లాడిన మాటలు.. కన్నప్పలో మంచు విష్ణు శివయ్యా అని అరిచే అరుపులు.. కమలహాసన్ గుణ కేసు చిత్రంలోని డైలాగ్.. ఇలా చాలా సినిమాలను రిఫరెన్స్ గా తీసుకొని తన సినిమాలో వాడారు. అయితే ఇది కామెడీ క్రియేట్ చేసేందుకు మాత్రమే వాడామని, ఒక ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు కూడా తెలిపారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి మంచు విష్ణు లెటర్..

అయితే ఆ తర్వాత సింగిల్ సినిమాలో ఈ డైలాగ్ లు అన్నింటిని తీసేయడం జరిగింది. అలా సింగిల్ సినిమాలో డైలాగ్స్ తీసేయడంతో శ్రీ విష్ణు ఎందుకు తీశాడు? అనేది అందరి ప్రశ్న.. ఇదిలా ఉండగా తాజాగా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూ వరకు ప్రశ్నిస్తూ సింగిల్ సినిమాలో శివయ్య అనే డైలాగ్ ను శ్రీ విష్ణు తీసేశారు.. అటు అల్లు అరవింద్(Allu Aravindh) తో కూడా మాటలు లేవు కదా మీరే డైలాగు తీయించారా అని ప్రశ్నించగా.. దానికి మంచు విష్ణు సమాధానం ఇస్తూ.. మీరు శ్రీ విష్ణునే అడగండి.. నాకేం తెలీదు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఒక లెటర్ రాశాను. అందులో బయట వాళ్ళు ఏమైనా అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఏకం అవుతాము. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా పైనే జోక్ చేసి, తమ సినిమాలో జోక్ గా చూపించారు. కరెక్ట్ గా అదే టైంలో ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. ఇప్పుడు మన కన్నప్ప సినిమా మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ సినిమా వచ్చినప్పుడు నేను కూడా ట్రోల్స్ చేస్తాను. లేదా నా సినిమాలో మీపై ట్రోల్స్ చేయవచ్చు.. అప్పుడు మీరు నన్ను అడగకూడదు అంటూ వార్నింగ్ ఇస్తూ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి లెటర్ రాశాడట మంచు విష్ణు.

ALSO READ: Trisha Krishnan: థగ్ లైఫ్ ఎఫెక్ట్.. విశ్వంభరకు దెబ్బేనా?

మంచు విష్ణు దెబ్బకు శ్రీ విష్ణు తట్టుకుంటాడా?

ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన చాలామంది మళ్లీ శ్రీ విష్ణుకి కౌంటర్ ఇచ్చాడు. ఇక మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మంచు విష్ణు దెబ్బకి శ్రీ విష్ణు తట్టుకుంటాడా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×