BigTV English
Advertisement

Health Tips: వేసవిలో.. ఎనర్జీ లెవల్స్ పెంచే ఫుడ్స్ ఇవే..

Health Tips: వేసవిలో.. ఎనర్జీ లెవల్స్ పెంచే ఫుడ్స్ ఇవే..

Best Summer Foods To Keep Energized: రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు వివిధ పనుల కోసం చాలా మంది బయటకు వెళుతుంటారు. అలాంటి వారు సమ్మర్ లో అనారోగ్యం బారిన పడకుండా తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి.


సమ్మర్ లో తీవ్రమైన ఎండలు, వడగాలుల వల్ల బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. వేడి వాతావరణం మన శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా త్వరగా అలసి పోతాం కూడా. అందుకే సమ్మర్ లో తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. హెల్తీ ఫుడ్స్ డైట్ లో చేర్చుకోవాలి. అవేంటంటే..

ఓట్ మీల్స్: ఓట్ మీల్స్ అనేది ఒక రకమైన తృణ ధాన్యం. ఓట్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బీటా-గ్లూకగాన్, అమైలోజ్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్ ను నియంత్రిస్తాయి. అంతే కాకుండా సమ్మర్ లో ఎనర్జీ లేవల్స్ ను భర్తీ చేస్తాయి.


కాఫీ: వేసవిలో అలసటను తగ్గించడానికి కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కెఫిన్ ఉండడం వల్ల ఇది మెదడును ప్రేరేపిస్తుంది. దీంతో శరీరం చురుకుగా పని చేస్తుంది. అలా అని కాఫీ ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

చేపలు: ట్యూనా, సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉన్న పోషకాలు శరీరం శక్తి వంతంగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఈ చేపల్లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మెటబాలిజం, ఎనర్జీ లేవల్స్ పెంచుతుంది. తద్వారా అలసట తగ్గుతుంది. ఈ పోషకాలు మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. శరీరంలో శక్తిని పెంచి రోగ నిరోదక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Also Read:వేసవిలో బీరకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆకు కూరలు: సమ్మర్ లో పాలకూర, బ్రోకలి, క్యాలి ఫ్లవర్ తో పాటు కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి వేసవిలో చెమట రూపంలో బయటికి పోయే పోషకాలను భర్తీ చేస్తాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

గుడ్లు: వేసవిలో గుడ్లు తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఎనర్జీ లెవల్స్ బ్యాలెన్స్ చేస్తాయి. కండరాలు బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి

Related News

Dates Benefits: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!

Tea for Kids: పిల్లలకు టీ ఇవ్వడం ప్రమాదకరమా? ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి?

Lifestyle Tips: రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి 7 మార్గాలు..

Fat Rich Fruits : ఫ్యాట్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Big Stories

×