E-Paper
Advertisement

Roja: జగన్ పరువు తీసిన రోజా? తిరుమల లడ్డు వివాదంపై పోల్, రిజల్ట్ చూసి దెబ్బకు డిలీట్!

Roja: జగన్ పరువు తీసిన రోజా? తిరుమల లడ్డు వివాదంపై పోల్, రిజల్ట్ చూసి దెబ్బకు డిలీట్!
Advertisement

Netizens Trolling On RK Roja: మాజీ మంత్రి రోజాకు నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆమె  తిరుమల గురించి పెట్టిన రెండు పోల్స్ కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెంటనే వాటిని డిలీట్ చేశారు. ప్రస్తుతం నెటిజన్లు ఆమె డిలీట్ చేసిన పోల్స్ స్క్రీన్ షాట్స్ తీసి రోజాను ఆటాడేసుకుంటున్నారు. జగన్ పరువును మీరే తీస్తున్నారంటూ తిట్టిపోస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రిగా పని చేసిన రోజా.. తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత రోజా జనాలకు కనిపించకుండా పోయారు. గత కొంతకాలంగా చెన్నైలోనే గడుపుతున్నారు. తరచుగా ఆమె ఏపీకి వచ్చి వెళ్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వివాదం చెలరేగడంతో ఆమె స్పందించారు. గత ప్రభుత్వ పెద్దలు తిరుమల లడ్డును అపవిత్రం చేశారనే చర్చ రోజుగా సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె రెండు పోల్స్ పెట్టారు. తొలుత తిరుమలలో ఎవరి పాలన బాగుంది? అంటూ పోల్ పెట్టారు. 24 గంటల్లో ఆ పోస్టుకు ఏకంగా 19 వేల మంది ఓట్లు వేశారు. ఆశ్చర్యకరంగా ఈ పోల్ లో 76 శాతం మంది చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ఓట్ చేయగా, 24 శాతం మంది జగన్ పాలన బాగుందని ఓట్ చేశారు. ఊహించని విధంగా జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్ల ఓటింగ్ రావడంతో రోజా షాక్ అయ్యారు. వెంటనే ఆ పోల్ ను డిలీట్ చేశారు.

రెండో పోల్ లోనూ రోజాకు షాకిచ్చిన నెటిజన్లు

Advertisement

తొలి పోల్ కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రోజా మరో పోల్ పెట్టారు. తిరుమల లడ్దు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది? అని పోల్ పెట్టారు. ఆప్షన్స్ గా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పోల్ కు సైతం 24 గంటల్లో 62 వేలకు పైగా నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 72 శాతం మంది నెటిజన్లు మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. 21 శాతం మంది చంద్రబాబు అంటూ ఓట్ చేశారు. మరో 7 శాతం మంది పవన్ కల్యాణ్ వల్ల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. రెండో పోల్ లోనూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ షాక్ అయ్యారు. వెంటనే ఈపోల్ ను కూడా రోజా డిలీట్ చేశారు. అంతేకాదు, పోల్ ఛానెల్ ను కూడా ఆమె డిలీట్ చేశారు.

రోజాను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

తిరుమలపై రోజా పెట్టిన రెండు పోల్స్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె పోల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ల తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. రోజాపై ఓ రేంజిలో సటైర్లు వస్తున్నారు.

Read Also: మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×