BigTV English

Tobacco in Laddu : మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Tobacco in Laddu : మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

Tobacco in Laddu : ఖమ్మంకు చెందిన ఒక భక్తురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే తిరుమలకు వెళ్లి వచ్చారు. ఇంట్లోవారికి, ఇరుగు పొరుగు వారికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇస్తుండగా.. ఒక లడ్డూలో నమిలిన పొగాకుని పేపర్ లో చుట్టి.. దానిని లడ్డూలో పెట్టినట్లు గుర్తించారు. ఈ విషయం మీడియాకు చేరడంతో.. తెలుగు రాష్ట్రాల్లో వైరలైంది. లడ్డూ తయారీకి జంతుకొవ్వుల్ని కలిపిన నెయ్యిని వాడటమే కాకుండా.. ఇలాంటివి కూడా చేస్తున్నారా అంటూ.. శ్రీవారి భక్తులు ఫైరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


తాజాగా ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. వార్తల్లో చూపించినట్లు పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందన్నది వాస్తవం కాదని, దానిని కొందరు భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారని X వేదికగా పేర్కొంది. తిరుమలలో నిర్వహించే లడ్డు పోటులో వైష్ణవ బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పాల్గంటారని తెలిపింది. ప్రతినిత్యం లక్షలాది లడ్డూరు తయారు చేసే ప్రాంగంణంలో 360 డిగ్రీల సీసీటీవీ నిఘా ఉంటుందని స్పష్టం చేసింది. ఇంత పగడ్బందీగా లడ్డూలను తయారు చేస్తుంటే.. ప్రసాదంలో పొగాకు వచ్చిందని దుష్ర్పచారం చేస్తుండటం శోచనీయమని విచారం వ్యక్తం చేసింది టీటీడీ. ఇలాంటి తప్పు విషయాలను భక్తులు నమ్మొద్దని సూచించింది.

Also Read: మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×