BigTV English

UTI and Fridge: మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడటానికి ఇంట్లో ఉండే ఫ్రిజ్ కూడా కారణమే, అదెలాగంటే..

UTI and Fridge: మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడటానికి ఇంట్లో ఉండే ఫ్రిజ్ కూడా కారణమే, అదెలాగంటే..

UTI and Fridge: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తరచూ మహిళల్లో కనిపిస్తున్న సమస్య. ఇది కాస్త బాధాకరంగానే ఉంటుంది. ఇది రావడానికి రిఫ్రిజిరేటర్ కూడా కారణం అని చెబుతోంది ఒక అధ్యయనం.


మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్యల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఒకటి. దీన్ని యుటిఐ అని పిలుచుకుంటారు. తమ జీవిత కాలంలో 60% మంది స్త్రీలు కచ్చితంగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే… మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి మీరు వాడే ఫ్రిడ్జ్ కూడా కారణం అవుతుంది. ఈ విషయాన్ని ఒక అమెరికా అధ్యయనం ధృవీకరించింది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?


యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మూత్రపిండాలు, మూత్రాశయం, మూత్ర నాళాలు కలిగి ఉన్న మూత్ర వ్యవస్థలో ఏదో ఒక భాగం. ఇందులో వచ్చే ఇన్ఫెక్షన్ ఎక్కువగా దిగువ మూత్ర నాళాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రంగా మారితే మూత్రపిండాలకు వ్యాపించి ఇబ్బంది పెడుతుంది. తీవ్రమైన మంటతో విలవిలలాడిపోతారు. ఎక్కువగా ఈ సమస్య మహిళల్లోనే వస్తుంది.

యూటీఐ ఎలా వస్తుంది?

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఈ. కోలి అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది. పరిశుభ్రత లేకపోవడం, లైంగిక చర్య సమయంలో వ్యాపించడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరే అవకాశం ఉంది.

Also Read: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

మహిళల్లో మూత్రనాళం బ్యాక్టీరియాను సులభంగా మూత్రశయం లోకి చేరేలా చేస్తుంది. అందుకే యుటిఐ అనేది ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. లైంగిక చర్య సమయంలో కూడా భాగస్వామి పరిశుభ్రంగా లేకపోతే మహిళల మూత్రనాళంలోకి ఈ బ్యాక్టీరియా వెళ్లే అవకాశం ఎక్కువ. మెనోపాజ్ సమయంలో, హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా అక్కడ చేరవచ్చు.

ఫ్రిడ్జ్ వల్ల కూడా..

అమెరికాలో చేసిన కొత్త అధ్యయనం రిఫ్రిజిరేటర్ వల్ల కూడా ఈ. కొలి అని పిలిచే బ్యాక్టీరియా మహిళల్లో చేరే అవకాశం ఉందని నిర్ధారించింది. బయటకొనే మాంసంలో 70 శాతం వరకు ఈ. కొలి ఉండే అవకాశం ఉంది. వీటిని ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన మాంసాన్ని మహిళలు తీసి తమ చేతితోనే శుభ్రం చేసి వండుతారు. తమకు తెలియకుండానే ఆ బ్యాక్టీరియాను తమ శరీరంపై చేరేలా చేసుకుంటున్నారు. అది చేతుల ద్వారా మహిళ శరీరంలో సులువుగా చేరుతున్నట్టు అధ్యయనం నిర్ధారించింది. కాబట్టి మాంసాన్ని తెచ్చి ఫ్రిజ్‌లో భద్రపరచడం వంటివి మానుకోవాలి. అలాగే ఫ్రిజ్ ను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకి గ్లౌజ్ కచ్చితంగా ధరించాలి. లేకుంటే చాలా సులువుగా మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు.

 

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×