Janasena Joinings: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న వీరంతా చేరుతున్నారని జనసేన అఫీషియల్‌గా ప్రకటించింది. కొద్ది సేపటి క్రితమే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌తో కిలారి రోశయ్య, కంది రవిశంకర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఆ తర్వాత చేరికపై ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అదే రోజున.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు నుంచి పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన గూటికి చేరనున్నారు.
రెండ్రోజుల క్రితమే మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ కు షాకిచ్చారు. ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేసి.. జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. రాజీనామా తర్వాత బాలినేని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జగన్ నిర్ణయాలను తాను వ్యతిరేకించానని, ఆయన తీసుకున్నవాటిలో తనకు కొన్ని నచ్చలేదని చెప్పారు. రాజీనామా తర్వాత పవన్ ను కలిసి జనసేన