Railways: ఏపీని అన్నివిధాలుగా అభివృద్ది చేయాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఎటువైపు వెళ్లినా రోడ్డు, రైలు, విమాన సర్వీసులు ఉండాలన్నది సీఎం చంద్రబాబు ప్రధాన కోరిక. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు రోడ్లు-ఎయిర్‌పోర్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు రైల్వే శాఖ అధికారులు కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు.
ఏపీకి కొత్త రైల్వే జోన్ అపాయింటెడ్ డే కోసం తెర వెనుక వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొత్త జోన్ పీహెచ్ఓడీల నియామకం జరుగుతోంది. జనవరిలో జోన్ నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇదెలా వుంచితే ఏపీలో వివిధ మార్గాల్లో కొత్త రైల్వేలైన్ల నిర్మాణం జరుగుతోంది.
ప్రస్తుతమున్న లైన్లకు అదనంగా మరికొన్ని కలిపి 1,336.60 కిలోమీటర్ల మేరా లైన్ల నిర్మాణానికి ఆ శాఖ అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. వీటికి దాదాపు రూ. 33 వేల కోట్ల వ్యయం అవుతుందని ఓ అంచనా. వాటిలో కొత్త లైన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్ అందులో ఉంది. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-ప్రశాంతి నిలయం కొత్త లైన్ అంటే 100 కిలోమీటర్లు ప్రతిపాదన చేశారు. దీనికితోడు అట్టిపట్టు-పుత్తూరు కొత్త లైన్ ఇది ఏపీ పరిధిలో ఉండనుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో నిడదవోలు నుంచి విశాఖ దువ్వాడ వరకు మూడో, నాలుగు లైన్ల నిర్మాణాల కోసం డీపీఆర్ చేసిన వాటిలో ఉన్నాయి.
ALSO READ: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి
అలాగే నల్లపాడు-కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య మూడు-నాలుకతో లైన్, ఓబుళవారి పల్లి-రేణిగుంట- గుంతకళ్లు మధ్య మూడు, నాలుగు లైన్ ఉన్నాయి. దీనికితోడుఇందుపల్లి-దుగ్గిరాల వద్ద బైపాస్ లు, రేణిగుంట వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి, బళ్లారి నుంచి బిక్కజాజూర రెండో లైన్ కు సంబంధించిన డీపీఆర్‌ను అధికారులు బోర్డుకు పంపారు.
అక్కడి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏపీలో రైల్వేకి చూడాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఆలోచన. ఇవికాకుండా కొత్తగా రానున్న రైళ్లను విశాఖతోపాటు తిరుపతి నుంచి పెట్టాలని భావిస్తోంది. డీపీఆర్ పంపిన ప్రాజెక్టులకు సంబంధించి కొంతభాగం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భరించాలి.
లేకపోతే భూములను సేకరించి ఇవ్వాలన్నది బోర్డు మాట. కాకపోతే విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టులను రైల్వే నిధులతో చేట్టాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. వీటిలో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని కొందరు అధికారులు.