Big Stories

Tiger: ఆపరేషన్ ‘మదర్ టైగర్’.. నల్లమల్లలో ‘T108E’ హంట్…

Tiger: నాలుగు పులి పిల్లలు. ముద్దుముద్దుగా ఉన్నాయి. చక్కగా ఆడుకుంటున్నాయి. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలను చూసిన ఆ ఊరి జనాలను పులి పిల్లలు ఆశ్చర్యానికి గురి చేశాయి. వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు పులి పిల్లలను చేరదీసిన అటవీ అధికారులు.. వాటిని తల్లి పులి చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మదర్ టైగర్ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ‘T108E’ కోడ్ నేమ్‌తో హంట్ చేపట్టారు.

- Advertisement -

నల్లమల్ల అడవులను జల్లెడపడుతోంది అటవీ శాఖ. పులి సంచరిస్తోందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో 50 ట్రాప్ కెమెరాలను అమర్చారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. 200 మంది సిబ్బంది.. పగ్ మార్క్స్ కోసం వెతుకుతున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం సమీపంలో, ముసలిమడుగు గ్రామ సమీపంలో.. పులి కాలిముద్రలు కనిపించాయి.ఆ ప్రదేశంలోనే మదర్ టైగర్ తిరుగుతోందనే అంచనాతో.. బుధవారం అర్థరాత్రి ఆపరేషన్ ఆరంభించారు.

- Advertisement -

నాలుగు పులి పిల్లను ఒకచోట ఉంచి.. క‌ృత్రిమ శబ్దాలతో తల్లి పులిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అలా ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ, మదర్ టైగర్ రాలేదు. పులి పిల్లలు తల్లి చెంతకు చేరలేదు. అటవీశాఖ సిబ్బంది నిరుత్సాహంగా వెనుదిరిగారు. అయినా, ఆపరేషన్ ఆపేదేలే అంటున్నారు. మళ్లీ తల్లి పులి జాడ కోసం గాలిస్తున్నారు.

ప్రస్తుతం ఆత్మకూరు మండలం బైర్లూటిలోని అటవీశాఖ అతిథి గృహంలో పులి కూనలను సిబ్బంది సంరక్షిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. పాలు, నీరు, ఉడికించిన చికెన్‌ లివర్‌ను పిలి పిల్లలకు ఇస్తున్నారు. నాలుగు పిల్ల టైగర్లు.. హుషారుగా ఆడుకుంటున్నాయని వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News