BigTV English

Pastor Praveen Case: అలా చేయకండి.. పాస్టర్ ప్రవీణ్ భార్య సంచలన వీడియో, విచారణ ముగిసినట్లేనా?

Pastor Praveen Case: అలా చేయకండి.. పాస్టర్ ప్రవీణ్ భార్య సంచలన వీడియో, విచారణ ముగిసినట్లేనా?

Pastor Praveen Kumar Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలన మారింది. ప్రవీణ్ మృతిపై పోలీస్ అధికారులు కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్ ఎలా చనిపోయారనేది ఇప్పటి వరకు కూడా ఓ క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో కొందరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడని చెబుతుంటే.. మరి కొందరు మాత్ర ప్రవీణ్ ను కిరాతకంగా హత్య చేసి చంపారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


మార్చి 24న మృతి చెందిన ప్రవీణ్ కుమార్ పగడాలది హత్యనా..? లేదా యాక్సిడెంటా..? అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ  కైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ మృతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇది కచ్చితంగా హత్యనే అంటూ.. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని ప్రవీణ్ కుమార్ సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రాజమండ్రిలో క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు, ప్రవీన్ కుమార్ పగడాల ఫాల్లోవర్స్, అతని కుటుంబ సభ్యులు కావాలనే పోలీసులు నిజాలు బయటపెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.

ALSO READ: TTD : త్వరలోనే ఆ పదవులు.. 100శాతం మార్పులు.. చంద్రబాబు క్లియర్ కట్


అయితే, ఇప్పటికే ప్రవీణ్ కుమార్ పగడాల కేసుకు సంబంధించి సీసీ ఫుటేజీ వీడియోలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతిపై ఎట్టకేలకు ఆయన భార్య జెస్సికా స్పందించారు. ఓ సంచలన వీడియో ఆమె విడుదల చేశారు. ‘దయచేసి మత సామరస్యాన్ని భంగపరచకండి. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేయొద్దు. దర్యాప్తు సమయంలో అందరి సహకారాన్ని కోరుతున్నా. ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దర్యాప్తును తప్పు దోవ పట్టించేలా.. ఎవరూ చేయకూడదని కోరుతున్నా. కొంత మంది యూట్యూబర్లు ప్రవీణ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు అయితే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రవీణ్ చేసిన సేవకు గౌరవంగా.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపమని అందరినీ కోరుతున్నా. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై ఆయన తమ్ముడు కిరణ్ పగడాల కూడా స్పందించారు. ‘ప్రవీణ్ మరణంపై కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇలాంటివి ఆపివేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. దయచేసి సహకరించండి’ అని ఆయన చెప్పారు.

అయితే క్రైస్తవ సంఘాలు మాత్రం ప్రవీణ్ ముఖం పైన గట్టి దెబ్బలు తాకాయని.. కచ్చితంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రవీణ్ జర్నీ లభమైన సీసీ ఫుటేజీ వీడియోలు చెక్ చేస్తూనే ఉన్నారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసుపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ALSO READ: BEL Recruitment: బెల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు, ఈ జాబ్ వస్తే రూ.90,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..

ALSO READ: Agniveer Jobs: ఎనిమిది, పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో భారీగా జాబ్స్.. ఇంకా వారం రోజులే గడువు

Related News

Free Electricity In AP: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్

Smart Ration cards: ఏపీలో ప్రారంభమైన స్మార్ట్‌ రేషన్ కార్డుల పంపిణీ

Jagan Tour: జగన్ తిరుమల పర్యటన.. మళ్లీ డిక్లరేషన్ లొల్లి, నో అంటున్న వైసీపీ

AP DSC verification: ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్‌ వాయిదా.. రాత్రి ప్రకటన వెనుక

AP New Scheme: సీఎం చంద్రబాబు కొత్త స్కీమ్.. కోటి వరకు, వారంతా ఆనందంలో

CM Progress Report: 51వ CRDA సమావేశం.. అమరావతి డెవలప్‌మెంట్‌కు ఎన్ని కోట్లు అంటే..!

Big Stories

×